About us

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నయార. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని మన అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనమందరం ఎన్నో కలలు కంటాము కానీ వాటిని కొంతమంది మాత్రమే సాకారం చేసుకోగలరు. ఎంతో మంది కలలు కలలుగానే మిగిలిపోతూ ఉంటాయి.

 

అలా కలలను సాకారం చేసుకోలేని వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అసలు నా కలలేమిటంటే? నేను 2nd క్లాస్ లో ఉన్నప్పుడు మా అన్నయ్య కరాటే నేర్చుకుంటూ ఉండేవాడు. దాని వల్ల స్కూల్ లో తనని అందరూ ప్రత్యేకంగా చూడడం స్టార్ట్ చేశారు. నేను అది గమనించి నేను కూడా కరాటే నేర్చుకుంటాను అని మా పేరెంట్స్ ని అడిగాను. 

చిన్నపిల్లవి కదా ఇప్పుడు వద్దులే అని మొదట అన్నా నేను పట్టువదలక పోయేసరికి ఒప్పుకున్నారు. ఒక్కగానొక్క కూతుర్ని కదా! నేనేం అడిగినా వాళ్ళు కాదనలేరు అనే విషయం నాకు బాగా తెలుసు. అలా చాలా ఇంట్రెస్ట్ గా కరాటే నేర్చుకోవడం స్టార్ట్ చేసాను నన్ను కూడా స్కూల్ లో మా అన్న కంటే ఎక్కువగా ప్రత్యేకంగా చూడడం స్టార్ట్ చేశారు.

 

కొంత కాలానికి నాకో ఆలోచన వచ్చింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంటేనే ఇలా చూస్తున్నారు అదే మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ ని అయితే ఇంక మన లెవెల్ ఎలా ఉంటుందో కదా అని అనుకున్నాను. అంతే ఆ రోజు నుండి నాది ఒకటే కల ఎలాగైనా కరాటే ట్రైనర్ ని కావాలి అని.

1st Achievement:


6th క్లాస్ లో నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది. ట్రైనర్ అవ్వాలి అంటే దానికోసం ప్రత్యేకంగా మళ్ళీ కొంతకాలం ట్రైనింగ్ తీసుకోవాలి దానికి బాగా ఖర్చు అవుతుంది & పైగా ఈ ఏజ్ లో ట్రైనర్ కావడం కష్టం అన్నారు.

 

పైగా 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కావడంతో పూర్తి కాన్సంట్రేషన్ చదువు మీదకి మళ్ళింది. చదువుకోవాలి అంటే మార్షల్ ఆర్ట్స్ మీద నుండి పూర్తిగా ధ్యాస లేకుండా ఉండాలి, అలా అయితేనే నేను చదవగలను అని దానిగురించి పూర్తిగా ఆలోచించడం మానేసాను.

 

అంతే అలా పడిన బ్రేక్ మళ్ళీ తీయడానికి కుదరలేదు.

 

ఆ తర్వాత నేను 9th క్లాస్ చదువుతుండగా నా కలలు డాక్టర్ వి అయితే బాగుంటుందని చెప్పాయి, కానీ నేను చాలా చాలా సెన్సిటివ్. ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితేనే చూసి తట్టుకోలేకపోయేదాన్ని అలాంటిది డాక్టర్ ని అయితే ఏక్సిడెంట్ అయిన వాళ్లకు సైతం ట్రీట్మెంట్ చేయాలి, ఆపరేషన్స్ కూడా చేయాలి, సో నా వల్ల కాదు అనిపించి ఆ కలకి కూడా పులుస్టాప్ పెట్టేసాను.

 

ఆ తర్వాత భూమ్మీద కాకుండా హాయిగా గాల్లో చేసే జాబ్ కావలనిపించింది. అంతే నా కలలు ఎయిర్ హోస్టెస్ అవ్వమని చెప్పాయి. అందుకే 10th తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ డీటైల్స్ కోసం మా పేరెంట్స్ తో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి మాట్లాడి వచ్చాము. ఇంకొన్ని రోజులు ఉంటే కోర్స్ లో జాయిన్ అయ్యి తర్వాత హాయిగా ఎయిర్ హోస్టెస్ అయ్యి ఉండేదాన్ని.

Collapsed My All Dreams:

ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటీ అని అదేదో సినిమా డైలాగ్ లాగా అయింది నా పరిస్థితి.


ఇంకొన్ని రోజుల్లో కోర్స్ లో జాయిన్ అవుతాను అన్న ఆనందంలో నేను ఉండగా ఒక రోజు పేపర్ లో “ఫ్లైట్ హైజాక్” అనే న్యూస్ మా మదర్ కంట్లో పడింది. అంతే ఎయిర్ హోస్టెస్ లేదు ఏమీ లేదు నువ్వీ కోర్స్ లో జాయిన్ అవ్వొద్దు అనేసింది. ఎందుకు అంటే ఏమో రేపు నువ్వు ఎయిర్ హోస్టెస్ అయ్యాక నువ్వు ఉన్న ఫ్లైట్ హైజాక్ అయితేనో? అమ్మో ఆ టెన్షన్ నేను భరించలేను అనడంతో ఆ కలకి కూడా ఒక పులుస్టాప్ పడింది.


ఆ తర్వాత ఫ్యాషన్ డిసైనింగ్ డిప్లమో చేసాను, ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అంటే హైదరాబాద్ లో ఉన్న NIFT లో జాయిన్ అవ్వాల్సిందే అని తెలిసింది. ఇప్పటి లాగా అప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ లేదు, ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవాలి. మాకు హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోవడం తో హాస్టల్ లోనే ఉండాలి, అది నాకు ఇష్టం లేదు. సో ఈ కల కూడా కలగానే మిగిలిపోయింది.

అలా ఒకటి కాదు రెండు కాదు నాకు ఊహ తెలిసినప్పటినుండి ఇప్పటివరకు నా కలలలో ఏదీ కూడా నెరవేరలేదు. కానీ ఇప్పుడు మాత్రం త్వరలోనే నా కల ఒకటి నెరవేరుతుంది అనే నమ్మకం కుదిరింది. ఆ కల ఏమిటంటే? ఒక సక్సెస్ఫుల్ బ్లాగర్ కావాలి అని.

How to Make a Career Decision?

ఈ బ్లాగ్ స్టార్ట్ చేయక ముందు వరకు నేను నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని, నా లైఫ్ లో ఇంక నేను అనుకున్నది ఏదీ సాధించలేనేమో అని బాధపడుతూ ఉండేదాన్ని. అసలు నా కెరీర్ సెట్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలి? ఏదో ఒకదాని మీద ఇంటరెస్ట్ ఉంటే దానిమీద కాన్సంట్రేషన్ చేయవచ్చు కానీ నాకు డిసైనింగ్ అంటే ఇష్టం, రైటింగ్ అంటే ఇష్టం, వీడియో ఎడిటింగ్ అంటే ఇష్టం, ఇతరులని మోటివేట్ చేసి వాళ్ళ లో ఉన్న నెగెటివ్ ఫీలింగ్స్ పోయేలా చేయడం అంటే ఇంకా ఇంకా ఇష్టం.


నేనేం చేయాలి అన్న నా ప్రశ్నకి నా మనస్సు నాకిచ్చిన సమాధానం ఒక్కటే, నీకు ఏ టాపిక్స్ మీద నాలెడ్జ్ ఉందో వాటిని అందరితో షేర్ చేసుకోవడం & నీలాగా కెరీర్ గురించి కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడం.


నేను ఎప్పుడూ నా మనసు మాట వింటాను అందుకే నా కలలు నెరవేరకపోయినా, నేను అనుకున్న దాని కన్నా బెటర్ లైఫ్ దేవుడు నా కోసం ప్లాన్ చేసి ఉంటాడు అన్న కాన్ఫిడెన్స్ తో ముందుకు సాగాలి అనుకున్నాను.

New Beginning:

అందరితో నా నాలెడ్జ్ ని షేర్ చేసుకోవాలి అంటే దానికి ఉన్న అత్యుత్తమ మార్గం “బ్లాగింగ్”. నాకు బ్లాగింగ్ ఎలా చేయాలో అస్సలు తెలియదు కానీ కొత్త స్కిల్స్ నేర్చుకోడానికి మాత్రం ఎప్పుడూ ముందు ఉంటాను. కానీ ఎలా నేర్చుకోవాలి అని ఆలోచిస్తున్న నాకు Blogger VJ బ్లాగింగ్ కోర్స్ కనబడింది వెంటనే లేట్ లేకుండా జాయిన్ అయ్యి & VJ గారి మెంటర్షిప్ లో బ్లాగింగ్ నేర్చుకుని ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను.


ఈ బ్లాగ్ లో మీరు ఇప్పటి వరకు కేవలం బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ గురించి మాత్రమే తెలుసుకున్నారు. ఇకముందు ఆన్లైన్ కోర్సెస్ తో పాటు బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి, జాబ్ ఆపర్చునిటీస్ ( Job opportunities ) & అప్డేట్స్, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ గురించి కూడా డీటైల్డ్ గా తెలుసుకుంటారు.


ఏంటి ఇంతేనా ఇంకా వేటి గురించి అయినా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? అయితే సరే మీ కోసం మెడిసిన్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, CA, లా, సాఫ్ట్వేర్ కోర్సెస్, మల్టీ మీడియా కోర్సెస్, ఆర్ట్ కోర్సెస్ ఇలా ఒకటేమిటి ప్రతి ఒక్కరి కెరీర్ కి అవసరమయ్యే ప్రతి విధమైన ఇన్ఫర్మేషన్ ని మీరు ఇక్కడ పొందవచ్చు. 


కెరీర్ అంటే ఏదో ఒక షాపింగ్ మాల్ లోనో లేక ఆన్లైన్ లోనో కొనుక్కునే ప్రొడక్ట్ కాదు. అవి నచ్చకపోతే ఇంకో చోట మరొకటి కొనుక్కోవచ్చు. కానీ కెరీర్ అనేది ఈ ప్రపంచంలో దేనితోనూ పోల్చలేని, ఇంత అని వెల కట్టలేని అమూల్యమైన ఒక భవిష్యత్తు.

Career Confusion:

బాగా చదువుకున్న వారు కూడా కెరీర్ విషయం లో కొంత కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు. దానికి కారణం ఏమిటంటే? కెరీర్ సెట్ అవ్వాలి అంటే దేని మీద డిపెండ్ అవ్వాలి, క్వాలిఫికేషన్? స్కిల్స్? లేక హాబీస్?


కొన్ని జాబ్స్ కి ఖచ్చితమైన క్వాలిఫికేషన్ ఉండితీరాలి, కొన్ని జాబ్స్ కి కొన్ని స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి, మరి కొన్ని జాబ్స్ కి ఈ రెండూ ఉండాలి. అన్నీ ఉన్నా మనకి సహనం ( Patience ) లేకపోతే కొన్ని జాబ్స్ అస్సలు చేయలేము. మీకు ఉన్న క్వాలిఫికేషన్ కి, మీకు ఉన్న స్కిల్స్ కి, మీ హాబీస్ కి తగినట్లుగా మీరు దేనిని ఎంచుకుంటే మీ కెరీర్ బాగుంటుంది అనేది ఈ బ్లాగ్ ద్వారా తెలుసుకోవచ్చు.


ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, జాబ్ పోతే మరో జాబ్ చూసుకోవచ్చు, ఒక బిజినెస్ ఫెయిల్ అయితే మరో బిజినెస్ చేసుకోవచ్చు, కానీ ప్రాణం పోతే మాత్రం ఎప్పటికీ తిరిగిరాదు. ఎంతో మంది ఎగ్జామ్స్ లో పాస్ అవ్వలేదని, జాబ్ రావడం లేదని, బిజినెస్ లో లాస్ వస్తుంది అని, కన్న కలలు ఏవీ నిజం కావడం లేదు అని ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Positive Attitude:

నా లైఫ్ లో ఇప్పటి వరకు నేను అనుకున్నవి ఏవీ జరగలేదు అలా అని నా జీవితాన్ని అంతం చేసుకుని ఉంటే ఈ రోజు ఈ బ్లాగ్ అంటూ ఉండేది కాదు, ఒక బ్లాగర్ గా నా కెరీర్ స్టార్ట్ అయ్యి ఉండేది కాదు. మనకి ఎదురయ్యే ప్రతీ వైఫల్యం మన భవిష్యత్తుకి ఒక్కో మెట్టు లాంటిది, ఎన్ని వైఫల్యాలను ఎదుర్కొంటే జీవితంలో అంత ఉన్నత శిఖరాలను చేరుకుంటాం అనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. 


ఎంతో మంది సరైన టైమ్ లో సరైన గైడెన్స్ ఇచ్చే వారు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడే వారికి ఒక చక్కని పరిష్కారం గా, ఎంతో మంది కెరీర్ కి ఒక మార్గదర్శకంగా, నిరాశ లో ఉన్న వారికి కెరీర్ పట్ల ఆశ కలిగించేలా ఈ బ్లాగ్ ఉండాలనేదే నా అభిలాష.

న్యూ ఆర్టికల్స్ కోసం & కొత్త అప్డేట్స్ కోసం నా బ్లాగ్ కి & టెలిగ్రామ్ ఛానల్ కి సబ్స్క్రయిబ్ చేసుకోండి. కెరీర్ విషయం లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలేమిటో నాకు తెలియజేస్తే వాటి పరిష్కారాన్ని ఆర్టికల్స్ ద్వారా తెలియజేస్తాను.