Anger Management Course Details In Telugu

N

Anger Management Course Details In Telugu

ప్రతి జీవికి కోపం వస్తుంది, కోపం మానవుడిలో ఒక భాగం, మనమందరం ఏదో ఒక సమయంలో కోపం తెచ్చుకునే వుంటాము. అస్సలు కోపం రానివారు బహుశా ఎక్కడా వుండకపోవచ్చేమో.

సాధ్యమైతే కోపం తెచ్చుకోకపోవడం మంచిది కాని అలా చేయడం చాలా కష్టం. కోపంలో మనం అవతలి వారిని ఎన్నో మాటలు అంటాము, ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తాము తర్వాత ఆ మాటల్ని మనం మర్చిపోతాము.

కానీ అవతలివారు ఆ మాటలకి ఎంత బాధపడతారో మానసికంగా ఎంత క్రుంగిపోతారో దాని గురించి చాలా మంది ఆలోచించరు. అలా బాధపడడం వల్ల వారి జీవితంలో వున్న ఆనందం కాస్తా పోతుంది. మరి దానికి కారణం ఎవరు?

కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఇతరులకే కాదు వారికి కూడా చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

1. కోపం రావడానికి కారణాలు

కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఒత్తిడి సహా చాలా విషయాల వల్ల మనకి కోపం వస్తుంది. కొంతమందికి మద్యపానం అలవాటు వుండడం వల్ల, కొంతమందికి తమ ఫీలింగ్స్ ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం లేక ఎవ్వరికీ తమ ఆలోచనలు చెప్పుకోలేకపోవడం వల్ల మనసులో అంతర్లీనంగా వుండే నిరాశ వల్ల కోపం వస్తుంది. కోపాన్ని ఒక జబ్బుగా పరిగణించరు, కానీ కోపం అనేది అనేక మానసిక ఆరోగ్య పరిస్థితుల యొక్క లక్షణం .

2. కోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు 

కోపం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో ముక్యమైనవి ఏంటంటే?

  • తలనొప్పి
  • కడుపు నొప్పి వంటి జీర్ణక్రియ సమస్యలు
  • ఆందోళన బాగా పెరగడం
  • నిరాశ
  • నిద్రలేమి
  • అధిక రక్త పోటు
  • కొన్ని రకాల చర్మ సమస్యలు
  • గుండెపోటు

ఇంకా చాలా రకాల సమస్యలు రావచ్చు. కొన్ని స్వల్పంగా వుంటే కొన్ని ధీర్ఘకాలం వుంటాయి.

3. Anger Management కోర్స్ ఎవరికి అవసరం

Anger management కోర్స్ అసలు ఎవరికి అవసరం? ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది కదా!
దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. పగతీర్చుకోవాలనుకోవడం
2. ఇతరులపై నిందలు వేయడం
3. తరచుగా కోపం రావడం
4. దూకుడుగా ప్రవర్తించడం
5. ఎక్కువ సేపు కోపం తగ్గక పోవడం
6. పరిస్థితికి తగ్గట్టుగా సహనం లేకపోవడం
ఇలాంటి లక్షణాలు వున్నవారు తప్పనిసరిగా ఈ కోర్స్ చేయడం మంచిది.

4. Anger Management Course ఎవరెవరు నేర్చుకోవచ్చు 

విద్యార్థులు, పేరెంట్స్, ఉపాధ్యాయులు, వైద్యులు, డైరెక్టర్లు, నిర్వాహకులు, కన్సల్టెంట్స్, బోధకులు, పోలీసులు, సెక్యూరిటీ పీపుల్, వ్యాపారులు, వ్యవస్థాపకులు, డ్రైవర్లు ఇంకా చెప్పాలంటే ప్రతిఒక్కరు.

ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే పెద్దలు మరియు పిల్లలు కోపంతో బాధపడుతూ, భావోద్వేగ స్థిరత్వం లేని ఎవరైనా సరే.

5. Anger Management Course లో ఏం నేర్చుకుంటాము 

1. ఏంగర్ మేనేజ్మెంట్ డిశార్డర్స్ ఎన్ని రకాలు వుంటాయి?
2. ఏంగర్ మేనేజ్మెంట్ ఎలా సహాయపడుతుంది?
3. ఏంగర్ మేనేజ్మెంట్ వల్ల మనం పనిచేసే కార్యాలయంలో కూల్ గా టెన్షన్ లేకుండా ఎలా వర్క్ చేసుకోవచ్చు.
4. ఫ్యామిలీ రిలేషన్స్ లో కోపం మరియు నిరాశను ఎలా నియంత్రించాలి?
5. కోపం ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపుతుంది.
6. మీ కోపం వెనుక నిజంగా ఏమి కారణం ఉందో ఎలా తెలుసుకోవాలి?
7. మీ కోపాన్ని వ్యక్తం చేయడానికి ఆరోగ్యకరమైన మార్గాలు.
8. కోపాన్ని అరికట్టడానికి కావలసిన వ్యూహాలు.
9. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ప్రశాంతంగా ఎలా ఉండాలి?
10. టెన్షన్ నుండి ఉపశమనం పొందడానికి హాస్యాన్ని ఎలా ఉపయోగించాలి?
11. మీ సంతోషకరమైన స్థలాన్ని ఎలా కనుగొనాలి?
12. మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలి?

ముగింపు:

మీ గురించి మీరు తెలుసుకోవడం, మరియు మీకు నిజంగా కోపం తెప్పించేది ఏమిటి అనే విషయాల గురించి మీరు నేర్చుకోవడం, మీ కోపం వల్ల జరగబోయే సంఘటనల హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ కోపం త్వరగా చల్లబరచడానికి మార్గాలను నేర్చుకోవడం వల్ల మీ కోపం ఎక్కువసేపు ఉండదు, మీ కోపాన్ని వ్యక్తపరచటానికి మీరు ఆరోగ్యకరమైన మార్గాలను కనుగొనడం ద్వారా ఏది మిమ్మల్ని అతిగా ప్రభావితం చేయదు.

మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు కోపం తెప్పించే విషయాలలో మీరే పాల్గొనకుండా చూసుకోవాలి. మనం జీవితంలో ఏది సాధించాలన్నా మన కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఈ Anger Management కోర్స్ తప్పకుండా కంప్లీట్ చేయండి.

మీకు ఈ పోస్ట్ నచ్చితే షేర్ చెయ్యండి. ఈ పోస్ట్ ఎంతవరకు యూస్ అయ్యిందో, ఇంకా ఏ కోర్స్ డీటైల్స్ కావాలో కింద కామెంట్ చెయ్యండి. కొత్త పోస్ట్స్ అప్డేట్స్ కావాలనుకుంటే బ్లాగ్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి. మళ్ళీ మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాను.


Leave a comment
Your email address will not be published. Required fields are marked *