మనం బాగా గమనించినట్లయితే, Artificial Intelligence (AI) అనేది ప్రస్తుతం బాగా “హాట్ టాపిక్”: Artificial Intelligence అంటే ఏమిటి అనేది బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ అనే పోస్ట్ లో కొంత వరకు తెలుసుకున్నాము. ఇటు సోషల్ మీడియాలో కానీ గూగుల్ లో కానీ యూట్యూబ్ లో కానీ అంటే ఆన్లైన్లో ఎక్కడ చూసినా దీనికోసం సెర్చ్ చేసే వారే. దీనికి సంబంధించిన యాడ్స్ కూడా వస్తూనే ఉంటాయి. దీని గురించి ప్రజలు మాట్లాడుకోకుండా వుండడం అసాధ్యమనే చెప్పవచ్చు.
ప్రస్తుతం చాలా చోట్ల చాలా పనులకు రోబోట్స్ నే యూస్ చెయ్యడం జరుగుతుంది. ఈ రోబోట్స్ మనిషిలాగే ఆలోచించడానికి, మనిషిలాగే పని చేయడానికి ఈ AI ని ఉపయోగిస్తారని అంటారు. అందుకని చాలా మంది మనసులో కొన్ని సందేహాలు ఉంటున్నాయి.
ఫ్యూచర్ లో AI వల్ల చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుందా? అన్ని పనులకు రోబోట్స్ ని యూస్ చేస్తే మనుషులకు ప్రాముఖ్యత తగ్గిపోయిందా? AI సాంకేతికతలు ప్రస్తుతం ఎక్కడ ఉపయోగించబడుతున్నాయి మరియు అవి భవిష్యత్ లో ఎక్కడ ఉపయోగించే అవకాశం ఉంది? ఇలా అనేక సందేహాలు వస్తూ ఉంటాయి.
ఈ డౌట్స్ అన్నీ పోవాలన్నా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి? దీనివల్ల వుండే లాభాలు & నష్టాలు ఏమిటో తెలుసుకోవాలన్నా ఈ AI కోర్స్ కంప్లీట్ చెయ్యాలిసిందే మరి.
ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో వున్న కోర్స్ కాబట్టి ఇది నేర్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుందేమో అని ఆలోచిస్తున్నారు కదూ! నాకు తెలుసు అందుకే మీకోసం ఈ AI కోర్స్ ని ఫ్రీ గా ప్రొవైడ్ చేసే వెబ్సైట్ గురించి చెప్తున్నాను.
elementsofai.com అనే సైట్ లో Artificial Intelligence కోర్స్ ని Introduction to AI & Building AI అని 2 పార్ట్స్ గా విభజించి కోర్స్ ని ఫ్రీ గా అందిస్తున్నారు. ఈ ఫ్రీ కోర్సెస్ కంప్లీట్ చేస్తే మనకు AI అంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు ఇంకా డీప్ గా నేర్చుకోవాలి అనుకుంటే పెయిడ్ కోర్సెస్ లో జాయిన్ కావచ్చు.
elementsofai వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి కింద ఇమేజ్ లో లాగా కనిపిస్తుంది. అక్కడ choose country అని వుంది కదా దానిని చేంజ్ చేయకపోయినా పర్వాలేదు, కొంచెం కిందకి స్క్రోల్ చెయ్యండి.
స్క్రోల్ చేశాక మనకు కింద ఇమేజ్ లో లాగా Introduction to AI & Building AI అని కనిపిస్తుంది కదా! మీకు AI గురించి ఏమీ తెలియక పోతే పార్ట్ 1 సెలక్ట్ చేసుకోండి. కొంచెం బేసిక్స్ తెలిసి వుంటే పార్ట్ 2 సెలక్ట్ చేసుకోండి.
పార్ట్ 1 – Introduction to AI కోర్స్ లో 6 చాప్టర్స్ ఉంటాయి, పార్ట్ 2 – Building AI లో 5 చాప్టర్స్ వుంటాయి. ఆ చాప్టర్స్ కంప్లీట్ చేశాక అక్కడ వున్న క్వచన్స్ కి మనం ఆన్సర్ చేస్తే తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు డీటైల్స్ నేను తెలుగులో చెప్తున్నాను కానీ కోర్స్ లాంగ్వేజ్ మాత్రం ఇంగ్లీష్ లో వుంటుంది.
1.What is Artificial Intelligence?
2. AI problem solving
3. Real world AI
4. Machine learning
5. Neural networks
6. Implications
1. Getting started with AI
2. Dealing with uncertainty
3. Machine learning
4. Neural networks
5. Conclusion
ఇప్పటి వరకు elementsofai.com లో ఈ Artificial Intelligence కోర్స్ లో 700,000 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. ఒకటి రెండూ దేశాల ప్రజలు కాదండోయ్ మొత్తం 170 దేశాల వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకుంటున్నారు. ఇందులో 40% వరకు మహిళలు నేర్చుకుంటున్నారంట.
ఈ elementsofai వెబ్సైట్ మాత్రమే కాకుండా Alison అనే వెబ్సైట్ కూడా ఈ Artificial Intelligence కోర్స్ ని ఫ్రీగా అందిస్తుంది.
మరి ఇంకెందుకాలస్యం మీరూ ఇప్పుడే ఈ కోర్స్ లో జాయిన్ అవ్వండి.
మీకు ఈ పోస్ట్ నచ్చితే షేర్ చెయ్యండి. ఈ పోస్ట్ ఎంతవరకు యూస్ అయ్యిందో & మీకు ఏ కోర్స్ డీటైల్స్ కావాలో కింద కామెంట్ చెయ్యండి. కొత్త పోస్ట్స్ అప్డేట్స్ కావాలనుకుంటే బ్లాగ్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి. మళ్ళీ మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాను.