ప్రస్తుతం కరోనా వల్ల ఎవరు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఉన్న టైం అంతా చాలా మంది ఆన్లైన్ లోనే గడుపుతున్నారు. కానీ అందులో ఎంతమంది టైంపాస్ కోసం ఆన్లైన్ ని యూస్ చేస్తున్నారు, ఎంత మంది తమ భవిష్యత్ ని ఓ బంగారు బాటగా మలుచుకోడానికి ఆన్లైన్ ని యూస్ చేస్తున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా?
“ఒక సర్వే ప్రకారం జనవరి 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.66 బిలియన్ ఏక్టివ్ ఇంటర్నెట్ యూసర్స్ ఉన్నారు – ప్రపంచ జనాభాలో ఇది 59.5 శాతం. ఈ యూసర్స్ మొత్తంలో 92.6 శాతం (4.32 బిలియన్లు) కేవలం మొబైల్ పరికరాల ద్వారా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకున్నారని మీకు తెలుసా?”
అసలు మీరు ఆన్లైన్ లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, దానిని ఎందుకు యూస్ చేస్తున్నారు? అసలు ఆన్లైన్ వల్ల మనకి లాభమా? నష్టమా? ఇలాంటి ప్రశ్నలు మీకు మీరు ఎప్పుడైనా వేసుకున్నారా?
ఈ మధ్య ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఆన్లైన్ వల్ల నష్టమే తప్ప లాభం లేదు అనేవారు కూడా చాలా మంది ఉన్నారు. కాదంటారా? కానీ ఆన్లైన్ ని సరిగ్గా యూస్ చేసుకుంటే మనం ఒక చక్కని కెరీర్ ఏర్పాటు చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇది నిజం!!
ప్రస్తుతం ఎంతోమంది ఆన్లైన్ కోర్సెస్ కంప్లీట్ చేసి వారి జీవితాన్ని వారికి నచ్చినట్లు మలుచుకుంటున్నారు. ఉద్యోగం కోసమైనా, బిజినెస్ డవలప్మెంట్ కోసం అయినా, బ్లాగర్ కావాలనుకున్న, డిజిటల్ మార్కెటర్ కావాలనుకున్న, మీకు అవసరం అయిన ప్రతి విధమైన నాలెడ్జ్ & స్కిల్స్ పెంచుకోవడానికి ప్రస్తుతం ఆన్లైన్ లో కొన్ని వేల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అన్ని కోర్సెస్ లోనుండి సెలక్ట్ చేసుకోవడం కష్టం కాబట్టి ఆన్లైన్ కోర్సెస్ లో కొన్ని బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ వివరాలు ఈ పోస్ట్ లో మనం తెలుసుకుందాం.
Anger Management అంటే అర్ధం కోపాన్ని నిగ్రహించడము. మనిషన్న ప్రతీవాడికి కోపం
వస్తుంది కదా! అబ్బో దానిని మేనేజ్ చెయ్యడానికో కోర్స్ కావాలా? అని వెటకారంగా అనేవారుకుడా చాలా మంది ఉన్నారు. అసలు ఈ కోర్స్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
మీకు ఆర్య – 2 సినిమాలో కాజల్ క్యారెక్టర్ గుర్తువుండే ఉంటుంది కదా! కోపం వస్తే చాలు చేతిలో ఉన్న ఫోన్ అప్పడం లా ముక్కలైపోవలసిందే. అది సినిమా కాబట్టి డమ్మీ ఫోన్స్ పెడతారు కాబట్టి పర్వాలేదు. నిజజీవితంలో కూడా చాలా మంది ఇలా కోపం వస్తే ఇలా చేసేవారు లేరంటారా?
కోపం ఎక్కువగా వున్న వారికి ఇటు పర్సనల్ లైఫ్ అటు ప్రొఫెషనల్ లైఫ్ ఏది కూడా సరిగ్గా ఉండదు. ఎవరూ అలాంటి వారితో అనుబంధాన్నీ కొనసాగించలేరు.
మనము, మనతో ఉన్నవారు సంతోషంగా ఉండాలంటే కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. అందుకే ఈ కోర్స్ ని ఫస్ట్ ప్లేస్ లో ఉంచాను. ఈ కోర్స్ లో మన కోపాన్ని ఎలా నిగ్రహించుకోవాలో, లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్ గా ఎలా లీడ్ చేయొచ్చో చెప్తారు.
Artificial Intelligence అంటే అర్థం కృత్రిమ మేధస్సు. తెలివైన మానవ ప్రవర్తనను అనుకరించే మెషీన్ యొక్క సామర్ధ్యం అని కూడా చెప్పవచ్చు. అంటే ఒక మనిషిని ఇమిటేట్ చెయ్యడం అన్నమాట.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది కంప్యూటర్ సైన్స్ యొక్క విస్తృత శాఖ, ఇది సాధారణంగా మానవ మేధస్సు అవసరమయ్యే పనులను చేయగల స్మార్ట్ యంత్రాలను నిర్మించటానికి సంబంధించినది. అత్యంత ప్రాచుర్యం పొందిన Artificial Intelligence అప్లికేషన్స్ లో ఒకటి గూగుల్ సెర్చ్ ఇంజిన్ .
Anger Management కోర్స్ లాగా ఇది అందరికీ తెలియని కోర్స్ కాదు, ప్రాముఖ్యం లేని కోర్స్ కాదు. ప్రస్తుతం ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ లో వున్న కోర్సెస్ లో మొదటిది Artificial Intelligence (AI). ట్రెండింగ్ లో ఉన్న కోర్స్ కదా అని Ai అని కనపడగానే ఆ కోర్సులో ఎన్రోల్ అవ్వకండి ఎందుకంటే adobe illustrator ని కూడా Ai అనే పిలుస్తారు.
కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా గమనించి అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సే అని కన్ఫామ్ చేసుకున్నాక ఎన్రోల్ అవ్వండి.
ఒక బ్లాగ్ కోసం పోస్ట్స్ రాయడాన్నే Blogging అని అంటారు. ఓ ఇంతేనా! చాలా ఈజీ అనుకుంటున్నారా? పోస్ట్స్ రాయడం ఈజీయే, కాకపోతే ఆ పోస్ట్స్ మీకు మాత్రమే కాకుండా చదివే రీడర్స్ కి కూడా బాగా నచ్చేలాగా, అర్థం అయ్యేలాగా రాయడం కొంచెం కష్టం.
రీడర్స్ కి ఏం నచ్చుతుందో మాకెలా తెలుస్తుందండి? ఇదే కదా మీ డౌట్. అవును నిజమే మరి! ఒక్కొక్కరికి ఒక్కోలా నచ్చుతుంది అందరికీ నచ్చేలా రాయడం సాద్యమయ్యే పనేనా? కాదు కదా! అందుకని అందరికీ నచ్చేలా రాయనవసరం లేదు. మీ టార్గెటెడ్ రీడర్స్కి నచ్చేలా రాస్తే చాలు.
అయ్యో మళ్ళీ ఇదేంటి టార్గెటెడ్ రీడర్స్ వాళ్ళు ఎవరు? అని ఆలోచిస్తున్నారా? మీకు అంతా గందరగోళంగా ఉంది కదా! ఈ గందరగోళం లేకుండా ఉండాలంటే మీరు బ్లాగింగ్ కోర్స్ చేయాల్సిందే.
ఇందులో మీకు బ్లాగ్ అంటే ఏమిటి? అది ఎలా సెట్ చెయ్యాలి? బ్లాగ్ కి పోస్ట్స్ ఎలా రాయాలి? ఏ టాపిక్ మీద పోస్ట్స్ రాస్తే మంచిది? బ్లాగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు ఇలాంటి వాటి గురించి డీటైల్డ్ గా ఈ బ్లాగింగ్ కోర్స్ లో తెలుసుకోవచ్చు.
Canva అనేది గ్రాఫిక్ డిజైన్ ప్లాట్‌ఫాం, ఇది సోషల్ మీడియా గ్రాఫిక్స్, ప్రెజెంటేషన్లు, పోస్టర్లు, డాక్యుమెంట్స్ మరియు ఇతర విజువల్ కంటెంట్‌ను సృష్టించడానికి ఉపయోగిస్తారు.
మీకు Photoshop, CorelDraw, InDesign లాంటి గ్రాఫిక్ డిసైనింగ్ సాఫ్ట్ వేర్స్ రాకపోయినా, ఎలాంటి డిజైనింగ్ స్కిల్స్ లేకపోయినప్పటికీ Canva ద్వారా చాలా అద్భుతమైన డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. డిజైనింగ్ స్కిల్స్ లేకుండా డిజైన్స్ ఎలా చెయ్యగలము ఇది నిజమేనా? అని సందేహపడకండి ఇది పూర్తిగా నిజం.
Canva లో మీకు కావలసినన్ని టెంప్లెట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని యూస్ చేసుకుని మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. Canva లో యూస్ చేసే టూల్స్, ఎలిమెంట్స్, ఫాంట్ స్టయిల్స్ వీటన్నింటి గురించి కొంచెం తెలుసుకుంటే ఇంకా బాగా డిజైన్ చేసుకోవచ్చు. వేరే గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అర్థం చేసుకోడానికి చాలా టైం పడుతుంది కానీ Canva చాలా ఈజీగా అర్థం అవుతుంది.
కాబట్టి లేట్ చెయ్యకుండా డిజైనింగ్ అంటే ఇష్టం ఉన్నవారు ఈ Canva కోర్స్ నేర్చేసుకోండి.
ఎవరైతే తమ కెమెరాతో మంచి వీడియోలను షూట్ చేయాలనుకుంటున్నారో, సినిమాటోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలో పనిచేయాలనుకుంటున్నారో వారికి ఈ Cinematography కోర్స్ చెయ్యడం తప్పనిసరి.
ఈ ఆన్‌లైన్ Cinematography కోర్సులో ఏ కెమెరాతోనైనాసరే అందమైన వీడియోలను ఎలా షూట్ చేయాలో నేర్చుకోవచ్చు.
ఒక వీడియో బాగా రావాలి అంటే ఏం కావాలి అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పేది ఒక మంచి కెమెరా కావాలి అని. కానీ నేనైతే కెమెరాలో వుండే సెట్టింగ్స్ గురించి బాగా తెలిసి ఉండాలి అని అంటాను.
ఎంత మంచి కెమెరా అయినా, అది ఎంత ఖరీదైనది అయినా దానిని ఎలా ఆపరేట్ చేయాలో తెలియక పోతే వీడియో బాగా ఎలా వస్తుంది చెప్పండి. అందుకే ఈ Cinematography కోర్స్ చేస్తే మీకు కెమెరా సెట్టింగ్స్, కెమెరా ఆపరేట్ చేసే విధానం మొత్తం తెలుసుకుని అద్భుతమైన వీడియోలు షూట్ చెయ్యవచ్చు.
మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడే ఈ కోర్స్ లో జాయిన్ అయిపోయి అద్భుతమైన వీడియోలు మీరు తీసేయండి.
ఇంటర్నెట్ మరియు ఆన్‌లైన్ ఆధారంగా డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించి చేసే మార్కెటింగ్ ని Digital Marketing అంటారు. అసలు డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఉపయోగం ఏమిటి? అని మీరనుకోవచ్చు.
ఇప్పుడు మీరు ఏమైనా కొనాలి అనుకున్నా, లేక ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా ఏం చేస్తారు వెంటనే గూగుల్ లో సెర్చ్ చేస్తారు కదా! మీరు అలా సెర్చ్ చేసాక, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి చూసిన, ఫేస్బుక్ ఆన్ చేసి చూస్తూ వున్నా మీరు సెర్చ్ చేసిన టాపిక్స్ కి సంబంధించిన యాడ్స్ వస్తుంటాయి. ఇలా మీకు చాలాసార్లు జరిగే ఉంటుంది.
ఇలా మీకు ఏం కావాలో దానికి సంబంధించిన యాడ్స్ వస్తే మనం ఆటోమాటిక్ గా మనకి దానిమీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది కోర్స్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలనిపిస్తుంది లేదా ఒక ప్రొడక్ట్ అయితే కొనేయాలి అని అనిపిస్తుంది కదా? ఇలా ఎవరికి ఏది అవసరమో తెలుసుకుని పర్టిక్యులర్ గా టార్గెట్ చేసి మార్కెటింగ్ చెయ్యడం ఒక్క డిజిటల్ మార్కెటింగ్ వల్ల మాత్రమే అవుతుంది.
ప్రస్తుతం దాదాపుగా అందరూ డిజిటల్ మార్కెటింగ్ మీదే ఆధారపడుతున్నారు.
కాబట్టి ఈ కోర్స్ టైమ్ పాస్ కోసం కాకుండా కాన్సంట్రేట్ గా నేర్చుకునే వాళ్ళకి ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది.
హ్యాకింగ్ఈ పేరు వినగానే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనవుతుంది కదా? ప్రస్తుతం ఎక్కువగా వినిపించే మాట ఇది.
సోషల్ మీడియా ఎకౌంట్స్, వెబ్సైట్స్, ఫోన్స్ ఇలా ఒకటేమిటి అన్నిటినీ హ్యాక్ చేస్తున్నారు. హ్యాకింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్. పట్టుబడితే పనిష్మెంట్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. మరి అలాంటి హ్యాకింగ్ మమ్మల్ని నేర్చుకోమంటారా? మేము బాగుండడం నీకు ఇష్టం లేదా? అని నన్ను
మనసులో తిట్టుకోకండి.
నేను మిమ్మల్ని హ్యాకింగ్ నేర్చుకోమనట్లేదు Ethical Hacking నేర్చుకోమంటున్నాను. ఏంటి మీకు అర్థం కాలేదు కదా! సరే కొంచెం అర్ధమయ్యేలా చెప్తాను. Ethical Hacking అనేది సైబర్ సెక్యూరిటీలో ఒక భాగం. ఒక కంప్యూటర్ సిస్టమ్ కానీ అప్లికేషన్ కానీ ఏదైనా డేటా కానీ హ్యాకర్స్ బారిన పడకుండా ఉండేలా ఎలా కాపాడాలో తెలియజేసేదే ఈ ఎథికల్ హ్యాకింగ్.
ప్రస్తుతం ఈ Ethical Hacking కోర్స్ నేర్చుకున్నవారికి కూడా మంచి జాబ్స్ వస్తున్నాయి. సో ఈ కోర్స్ నేర్చుకుని మీరు Ethical Hacker గా జాబ్ తెచ్చేసుకోండి.
Google Workspace నే గతంలో G Suite అనేవారు.
Gmail, Calendar, Meet, Chat, Drive, Docs, Sheets, Slides, Forms, Sites, వీటన్నిటిని కూడా Google Collaboration tools అని అంటారు.
ఈ వెబ్ అప్లికేషన్స్ ని Google, బిజినెసెస్ కోసం క్రియేట్ చెయ్యడం జరిగింది.
డిజిటల్ మార్కెటింగ్ చేసేవారు ఈ గూగుల్ వర్క్ స్పేస్ ని యూస్ చెయ్యడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.
ఈ G Suite కోర్స్ లో వీటన్నిటి గురించి డీటైల్డ్ గా తెలుసుకోవచ్చు.
Machine Learning అనేది కంప్యూటర్ అల్గారిథమ్‌లను స్టడీ చెయ్యడం ద్వారా పూర్వ అనుభవం మరియు డేటా వాడకం ద్వారా స్వయంగా దానికదే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇది artificial intelligence లో భాగంగా కనిపిస్తుంది.
Machine learning అప్లికేషన్స్ గత అనుభవం ఆధారంగా ఫలితాలను అందిస్తాయి. వ్యాధుల నిర్ధారణకు సహాయపడే పద్ధతులు మరియు సాధనాలలోనే కాకుండా కంప్యూటర్ స్పీచ్ రికగ్నైషన్ అంటే మాట్లాడే పదాలను టెక్స్ట్‌లోకి అనువదించడం వంటి వాటిలో కూడా ఈ Machine learning ని ఉపయోగిస్తారు.
ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనం యూస్ చేసే Gmail లో స్పామ్ ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది కదా! ఇది స్పామ్ ఫిల్టర్ ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. ఈ స్పామ్ ఫిల్టర్ Machine learning ఆధారంగా స్పామ్ మెయిల్స్ ని ఫిల్టర్ చేసి మన Gmail ప్రైమరీ ఫోల్డర్ లోకి రాకుండా స్పామ్ ఫోల్డర్ లోకి పంపిస్తుంది.
ఇంకా దీని గురించి డీటైల్డ్ గా తెలుసుకోవాలంటే ఈ కోర్సు లో జాయిన్ అవ్వాల్సిందే.
Python అనేది విస్తృతంగా ఉపయోగించే, మరియు ఉన్నత స్థాయి ప్రోగ్రామింగ్ భాష. ఇది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ కోసం ఉపయోగించబడుతుంది.
Python అనేది పెర్ల్, రూబీ, స్కీమా లేదా జావాతో పోల్చదగిన స్పష్టమైన మరియు పవర్ఫుల్ ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ భాష.
Data Science మరియు Machine Learning లలో పరిచయ కోర్సులకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని సెలక్ట్ చేసుకుంటూ వుంటారు.
ఈ Python ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నవారికి పైథాన్ డవలపర్, డేటా అనలిస్ట్, డేటా జర్నలిస్ట్ ఇవే కాకుండా ఇంకా అనేకమైన జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి.
ప్రెజెంటేషన్ అనేది కమ్యూనికేషన్ కి బాగా పాపులర్ అయిన మార్గం. ప్రస్తుతం చాలా మందికి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ వున్నా కానీ చేసే జాబ్ లో ప్రమోషన్స్ రాకపోవడానికి వారికంటూ ప్రత్యేక గుర్తింపు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే? ఈ Presentation skills లేకపోవడమే.
మన మనసులో ఎన్నో అద్భుతమైన ఆలోచనలు ఉండి ఉండవచ్చు, కానీ అవి ఎదుటివారికి అర్థం అయ్యేలాగా చెప్పలేకపోతే దానికి ప్రయోజనం ఉంటుందంటారా? అస్సలు ఉండదు కదా! మీరే చెప్పండి.
కొంతమందికి ఎక్కువ మందిలో మాట్లాడాలంటే చాలా భయం, వాళ్ళ మనసులో ఉన్న కాన్ఫిడెన్స్ వాళ్ళ మాటల్లో ఎక్కడా కనబడదు, గుండెల్లో ఉన్న ధైర్యం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో కనబడదు.ఎదో చెప్పాలనుకుని కంగారులో ఎదో చెప్తారు.
ఈ Presentation skills కోర్స్ లో మన మాటతీరు ఎలా ఉండాలో, బాడీలాంగ్వేజ్ ఎలా ఉండాలో మనం చెప్పాలనుకున్నది కాన్ఫిడెంట్గా ఎలా చెప్పాలో నేర్చుకోవచ్చు.
Podcast అంటే సింపుల్ గా చెప్పాలంటే డిజిటల్ ఆడియో ఫైల్. Podcast అనే పదం “iPod” మరియు “Broadcast” అనే రెండు పదాలనుండి తీసుకోవడం జరిగింది. ప్రపంచంలో జనాభా అంతా బిజీగా ఉండడంతో ఈ పోడ్కాస్ట్ ఫార్మాట్ చాలా ప్రజాదరణ పొందింది.
“మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అవుట్ లుక్ 2020 నివేదిక ప్రకారం, చైనా మరియు యుఎస్ తరువాత 57.6 మిలియన్ల మంత్లీ ఆడియన్స్ తో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద పోడ్కాస్ట్ లిజనింగ్ మార్కెట్‌గా అవతరించిందంటే ఈ పోడ్కాస్ట్ కి ఎంత ఆదరణ వుందో మనం అర్థం చేసుకోవచ్చు.”
పోడ్కాస్టింగ్ ద్వారా మనీ ఎర్న్ చెయ్యడానికి బాగా స్కోప్ ఉండడంతో ఇది బాగా పాపులర్ అయ్యింది. మరి ఇంకెదుకాలస్యం మీరు ఇప్పుడే ఈ కోర్స్ లో జాయిన్ అయ్యి పోడ్కాస్టింగ్ గురించిన ఫుల్ డీటైల్స్ తెలిసేసుకోండి.
ఈ రోజుల్లో ఫోటో తీయడం చాలా సులభం. మనం సాధారణంగా చేయవలసింది షట్టర్ రిలీజ్ బటన్‌ను ప్రెస్ చెయ్యడం అంతే తర్వాత కెమెరా మిగిలిన పనిని చేసేస్తుంది.
ఒక ఫోటోగ్రాఫర్‌గా సక్సెస్ అవ్వాలి అంటే కేవలం ఏదోఒకరకంగా ఫోటో తీస్తే సరిపోదు. కరెక్ట్ లైటింగ్ కూడా ఫోటో కి చాలా ఇంపార్టెంట్, అంటే డే లైట్ లో అయితే ఎలా తీయాలి నైట్ అయితే ఎలా? ఇండోర్లో అయితే ఎలాంటి లైట్స్ యూస్ చెయ్యాలి అని మాత్రమే కాకుండా కరెక్ట్ లెన్స్ ఉపయోగించడం కూడా తెలిసుండాలి.
ఫోటో అద్భుతంగా రావాలి అంటే కెమెరా సెట్టింగ్స్ కూడా పూర్తిగా తెలుసుకోవాలి. మరి ఇవన్నీ తెలియాలి అంటే ఏం చెయ్యాలి వెంటనే Photography కోర్స్ లో జాయిన్ అవ్వాలి. అంతే కదా మరి!
Visual effects నే షార్ట్ గా VFX అని అంటారు. ఫిల్మ్ మేకింగ్‌లో, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అనేది నిజ జీవితంలో ఫిజికల్ గా లేని ఏదైనా ఆన్ స్క్రీన్ చిత్రాల సృష్టి.
VFX ఫిల్మ్ మేకర్స్ కి పర్యావరణాలు, వస్తువులు, జీవులు మరియు లైవ్ యాక్షన్ షాట్ సందర్భాలలో మాములుగా చిత్రీకరించడం అసాధ్యమైన లేదా అసాధ్యమైన వ్యక్తులను సృష్టించడానికి అనుమతిస్తుంది .
అంటే ఒక ఫిల్మ్ లో బాగా ప్రమాదకరమైనవి లేదా అసాధ్యమైన సన్నివేశాల కోసం లైవ్ యాక్షన్ ఫుటేజ్ మరియు సిజి ఎలిమెంట్స్ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ని కలిపి చేసేదే విజువల్ ఎఫెక్ట్స్.
సాధారణంగా ఎక్కువగా బిగినర్స్ కి యూస్ చేసే VFX సాఫ్ట్వేర్స్ : Adobe After Effects, Blender, Autodesk Maya
ఇంకా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కానీ మెయిన్ గా ఇవి యూస్ చేస్తూవుంటారు.
ఇంకా VFX కి సంబంధించిన డీటైల్స్ కావాలంటే ఈ కోర్స్ లో జాయిన్ అవ్వాల్సిందే.
WordPress అనేది PHP లో వ్రాయబడిన మరియు MySQL లేదా MariaDB డేటాబేస్ తో జతచేయబడిన ఉచిత మరియు ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్.
WordPress అనేది మీ స్వంత వెబ్‌సైట్ లేదా బ్లాగ్ ను సృష్టించడానికి సులువైన, అత్యంత ప్రజాదరణ పొందిన మార్గం.
వాస్తవానికి, ఇంటర్నెట్‌లోని అన్ని వెబ్‌సైట్లలో 40% పైగా WordPress అధికారాన్ని కలిగి ఉంది. అమ్మో అంటే WordPress ఎప్పటి నుండి ఉంది, అసలు దీనిని ఎప్పుడు లాంచ్ (విడుదల) చేశారు అని అనుకుంటున్నారా?
2003 సం. మే నెల 27న WordPress ని లాంచ్ చెయ్యడం జరిగింది. ఈ మధ్యనే 18వ యానివర్సరీ చేసుకుని సక్సెస్ఫుల్ గా ముందుకు సాగిపోతుంది.
ఎందుకు ఇంత మంది వర్డ్ ప్రెస్ ని యూస్ చేస్తున్నారు అంటే, ఇది పూర్తిగా యూసర్ ఫ్రెండ్లీ. బిగినర్స్ సైతం చాలా ఈజీగా థీమ్ ని కష్టమైజ్ చేసుకోవచ్చు. కావలసినన్ని థీమ్స్ & ప్లగిన్స్ ఫ్రీ గా మనకి అందుబాటులో ఉంటాయి.
మీకు వర్డ్ ప్రెస్ గురించి ఏమీ తెలియకపోయిన, ఈ కోర్సు ద్వారా మీరు WordPress ఉపయోగించి ఒక వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటారు.
ఈ కోర్సెస్ అన్నీ కూడా బెస్ట్ కోర్సెస్. ఇంకా వీటిలో నుండి టాప్ 3 కోర్సెస్ ఏంటి అనే విషయానికి వస్తే మాత్రం నేను Blogging, Digital Marketing, Photography అని అంటాను.
ఎందుకు అంటే Blogging అనేది స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయిస్, బిజినెస్ పీపుల్, రిటైర్డ్ పర్సన్స్ ఇలా ఎవరికైనా ఏ వయసు వారికైనా వీలుగా ఉంటుంది.
Digital Marketing అనేది ఇటు బిజినెస్ పరంగానూ, లేక జాబ్స్ పరంగానూ, లేక ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్న అన్నిటికీ వీలుగా ఉంటుంది.
Photography అనేది క్వాలిఫికేషన్, ఏజ్, ప్లేస్, లాంగ్వేజ్ ఇలా దేనితోను సంబంధం లేనిది. ఇటు హాబీ గాను ప్రొఫెషనల్ గాను రెండింటికీ కూడా చాలా మంచిది.
మిగిలిన కోర్సెస్ అన్నీ కూడా బెస్ట్ కోర్సెస్సే, కాకపోతే అవి స్టూడెంట్స్ కి నేర్చుకోవడానికి ఈజీగా వుంటుంది కానీ మిగిలిన వారికి కొంచెం టైం సరిపోక పోవచ్చు లేదా కష్టంగా వుండవచ్చు.
ఈ కోర్సెస్ లో ఏదో ఒకటి నేర్చుకుంటే మా లైఫ్ సెట్ అయిపోయినట్లేనా? మా కెరీర్ అద్భుతంగా ఉంటుందా? అని నన్ను అడగకండి. ఎందుకంటే మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా, ఎన్ని సర్టిఫికెట్స్ సంపాదించుకున్న మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే కృషి, పట్టుదల, నమ్మకం, సహనం ఇవన్నీ ఉండాలి.
ఏ కోర్స్ సెలక్ట్ చేసుకోవాలి అని ఇంకా మీకు క్లారిటీ రాలేదా? ఈ కోర్సెస్ లో ఏ సాఫ్ట్వేర్స్ గురించి చెప్తారు? ఏమేం మాడ్యూల్స్ ఉంటాయి? బేసిక్స్ ఏమి తెలియకుండా కోర్స్ లో ఎలా జాయిన్ అవుతాము అని అనుకుంటున్నారా? అయితే మీకోసం ముందు పోస్ట్స్ లో ఈ కోర్సెస్ లో ఒక్కో కోర్స్ గురించి ఇంకా డీటైల్డ్ గా అంటే ఆ కోర్స్ లో ఏమేం మాడ్యూల్స్ ఉంటాయి, ఏ సాఫ్ట్వేర్ గురించి చెప్తారు అని డీటైల్డ్ గా చెప్తాను.
మీకు ఈ పోస్ట్ నచ్చితే షేర్ చెయ్యండి. ఈ పోస్ట్ ఎంతవరకు యూస్ అయ్యిందో, ఇంకా ఏ కోర్స్ డీటైల్స్ కావాలో కింద కామెంట్ చెయ్యండి. కొత్త పోస్ట్స్ అప్డేట్స్ కావాలనుకుంటే బ్లాగ్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి. మళ్ళీ మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాను.
Python digital Marketing bloging
surely I will provide these courses details in upcoming posts.