Blogging Course Details in Telugu

N

Blogging Course Details in Telugu

బ్లాగింగ్ గురించి కొంత వరకు మనం ఇంతకు ముందు “బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ తెలుగులో ” అనే పోస్ట్ లో తెలుసుకున్నాం. బ్లాగింగ్ అనగానే మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే అసలు ఫస్ట్ బ్లాగ్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు అని. మొదటి బ్లాగ్ “లింక్స్.నెట్” అని చాలా మంది నిపుణులు చెప్తూ వుంటారు. 1994 సంll లో జస్టిన్ హాల్ ( Justin Hall ) అనే ఒక విద్యార్థి తన రచనలను ప్రచురించడం కోసం ఈ బ్లాగ్ ని స్టార్ట్ చేశారు.

1. బ్లాగింగ్ ఎందుకు చేయాలి ?

1. మన భావాల్ని వ్యక్త పరచడానికి
2. మన అభిరుచులను పంచుకోడానికి
3. మన నాలెడ్జ్ ని షేర్ చేసుకోడానికి
4. మన రైటింగ్ స్కిల్స్ ని మెరుగుపరచుకోడానికి
5. క్రొత్త వ్యక్తులను పరిచయం చేసుకోడానికి
6. క్రొత్త విషయాలు నేర్చుకోడానికి

2. బ్లాగింగ్ యొక్క ప్రయోజనాలు:

1. ఆన్‌లైన్‌ ద్వారా మనీ సంపాదించవచ్చు
2. ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను రూపొందించవచ్చు
3. టెక్నికల్ నాలెడ్జ్ పొందవచ్చు
4. ఓన్ ప్రొడక్ట్స్ సేల్ చేయవచ్చు
5. ఒక క్రొత్త భాషలో ప్రావీణ్యం పొందవచ్చు
6. మీరొక ఎక్స్ పర్ట్ కావచ్చు
7. బ్లాగింగ్ మీకు స్వేచ్ఛను ఇస్తుంది
8. జాబ్ ఆఫర్స్ రావచ్చు
9. కొత్త బిజినస్ స్టార్ట్ చేయవచ్చు
10. మీ ఆన్‌లైన్ గుర్తింపును & నమ్మకాన్ని పెంచుకోవచ్చు

అన్నిటికన్నా ముఖ్యమైనది మనకి బాస్ అంటూ ఎవరూ ఉండరు.

పైన బ్లాగింగ్ గురించిన ప్రయోజనాలు నేను చెప్పినవి కొన్ని మాత్రమే, చెప్పాలంటే ఇంకా చాలా చాలా వున్నాయి. బ్లాగింగ్ ద్వారా మనకు ఎటువంటి అవకాశాలు వస్తాయో కొన్నిసార్లు వూహించడం కూడా కష్టమే. కానీ ఖచ్చితంగా ఒక మంచి కెరీర్ ని బ్లాగింగ్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకునే వారికి బ్లాగింగ్ అనేది ఒక వరమనే చెప్పుకోవాలి. పైగా బ్లాగింగ్ కి ప్రత్యేకంగా ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.

మరి ఇన్ని ప్రయోజనాలు వున్న బ్లాగింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో అని టెన్షన్ పడుతున్నారా?

బ్లాగింగ్ ని మీరు హాబీ గా చేయాలి అనుకుంటే మీకు ఫ్రీ బ్లాగింగ్ కోర్స్ సరిపోతుంది. అదే మీరు బ్లాగింగ్ ద్వారా ఒక మంచి కెరీర్ ని సెట్ చేసుకోవాలి అన్నా, బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా పెయిడ్ కోర్స్ చేయాలి.

3. ఫ్రీ కోర్సెస్ vs పెయిడ్ కోర్సెస్

ఫ్రీ కోర్సెస్:

ఫ్రీ కోర్సెస్ లో మనం వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్స్ వీడియోస్ మాత్రమే చూడగలం. మనకు వచ్చే డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు వుండరు. మనం ఏ టాపిక్ సెలక్ట్ చేసుకుంటే మంచిదో చెప్పేవారు వుండరు. డొమైన్ & హోస్టింగ్ పర్చేజ్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరినీ అడగడానికి వుండదు. బ్లాగ్ సెటప్ ఎలా చేయాలో పూర్తిగా చెప్పరు. బ్లాగ్ పోస్ట్స్ సెర్చ్ ఇంజిన్స్ కి తగినట్లు ఎలా రాయాలో చెప్పరు. కంటెంట్ పోస్ట్ చేశాక సోషల్ మీడియాలో మన పోస్ట్స్ ఎలా ప్రమోట్ చేసుకోవాలో చెప్పరు. మన బ్లాగ్ ని సెర్చ్ ఇంజిన్స్ కి ఎలా సబ్మిట్ చేయాలో చెప్పరు. బ్లాగింగ్ ని హాబీగా చేసేవారు ఇవన్నీ తెలుసుకోకపోయినా కొంత పర్వాలేదు గానీ బ్లాగింగ్ ద్వారా మనీ సంపాదించాలి అనుకునే వారు ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి.

పెయిడ్ కోర్సెస్:

మనం ఒక ప్రొఫెషనల్ బ్లాగర్ కావడానికి అవసరమైన మొత్తం కంటెంట్ ని ఈ కోర్స్ లో ప్రొవైడ్ చేస్తారు. కోర్స్ వీడియోస్ లో మనకి ఏది అర్దం కాకపోయినా మనకి ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ కోర్స్ చేసే స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఫేస్ బుక్ గ్రూప్స్ కానీ వాట్సప్ గ్రూప్స్ కానీ వుంటాయి. వాటిలో మన డౌట్స్ అడిగితే త్వరగా మనకి రిప్లయ్ ఇవ్వడం జరుగుతుంది. డొమైన్ & హోస్టింగ్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనకి ఏం చేయాలో కావలసిన సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్లాగ్ స్టార్ట్ చేసిన తరువాత బ్లాగ్ సెటప్ లో కానీ, కంటెంట్ క్రియేషన్ లో కానీ లేక వేరే ఏ విదమైన సపోర్ట్ కావాలన్న మనకి వుంటుంది.

4. Udemy Free Blogging Course Details

udemy free blogging coursedetails

 

ఇందులో 8 సెక్షన్స్, 11 వీడియోస్ వుంటాయి. లాంగ్వేజ్ – ఇంగ్లీష్
1. Welcome to the course :
ఈ ఫ్రీ కోర్స్ లో కవర్ చేయబోయే టాపిక్స్ గురించి చెప్తారు.
2. Registering a domain name & web hosting:
డొమైన్ & వెబ్ హోస్టింగ్ రిజిస్టర్ చేసుకోవడం.
3. Installing WordPress on hosting & domain name:
వర్డ్ ప్రెస్ ని ఇన్స్టాల్ చేయడం
4. Logging into WordPress & Viewing site:
వర్డ్ ప్రెస్ బ్లాగ్ కి లాగింగ్ అవ్వడం & మన సైట్ ని చూడడం.
5. Changing WordPress themes:
బ్లాగ్ థీమ్ చేంజ్ చేయడం.
6.Creating blog posts:
బ్లాగ్ పోస్ట్స్ క్రియేట్ చేయడం
7.Some Extra Training:
బ్లాగ్ పేజెస్ యాడ్ చేయడం & మెనూస్ క్రియేట్ చేయడం.
ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడం.
8. Bonus
ఒక ఫ్రీ వీడియో డౌన్లోడ్ చేసుకోడాని లింక్ ఇస్తారు అదేంటో కోర్స్ లో ఎన్రోల్ అయితే తెలుస్తుంది.

Udemy Free Blogging Course Details తెలుసుకున్నారుగా? మీరు ఫ్రీ గా మీ బ్లాగింగ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడే Udemy Free Blogging Course లో ఎన్రోల్ అవ్వండి.

5. Blogger VJ Blogging Cum Mini Digital Marketing Course Details

Blogger VJ Blogging Cum Mini Digital Marketing Course Details

ఇందులో 7 సెక్షన్స్, 60+ వీడియోస్ వున్నాయి. కోర్స్ లాంగ్వేజ్ – తెలుగు
1. Introduction:
బ్లాగింగ్ అంటే ఏమిటి?
బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ అంటే ఏమిటి? వాటిని ఎలా సెలక్ట్ చేసుకోవాలి?
నిష్ అంటే ఏమిటి? ఎలా సెలక్ట్ చేసుకోవాలి? నిష్ లో వుండే కేటగిరీస్ ఏమిటి?
బ్లాగింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చెయ్యవచ్చు?

2. Blog setup:
వర్డుప్రెస్ (WordPress) అంటే ఏమిటి?
డొమైన్ అంటే ఏమిటి? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
హోస్టింగ్ అంటే ఏమిటి? ఎలా రిజిస్టర్ అవ్వాలి?
డొమైన్ ని హోస్టింగ్ తో ఎలా లింక్ చెయ్యాలి?
వర్డ్ ప్రెస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి?
వర్డుప్రెస్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది?
థీమ్స్ అంటే ఏమిటి?
ప్లగిన్స్ అంటే ఏమిటి? అవి ఎలా ఇన్స్టాల్ చేయాలి?
బ్లాగ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి?
బ్లాగ్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలి?
మెనూస్ ఎలా క్రియేట్ చేయాలి?
Generate Press అనే థీమ్ ని ఇన్స్టాల్ చేసి ఎలా కష్టమైజ్ చేయాలి?

3. Content creation:
కంటెంట్ అంటే ఏమిటి?
కీ వర్డ్స్ అంటే ఏమిటి?
కీ వర్డ్స్ రీసెర్చ్ ఎలా చేయాలి?
గోల్డెన్ ఫార్ములా అంటే ఏమిటి?
Canva ద్వారా ఇమేజెస్ ఎలా డిసైన్ చేయాలి?

4. SEO:
బేసిక్స్ ఆఫ్ SEO
బ్లాగ్ ని సెర్చ్ ఇంజిన్స్ కి ఎందుకు సబ్మిట్ చేయాలి?
గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏమిటి?
బింగ్ సెర్చ్ కన్సోల్ అంటే ఏమిటి?
గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి బ్లాగ్ ని ఎలా సబ్మిట్ చేయాలి?
బ్లాగ్ తో గూగుల్ అనలిటిక్స్ ని ఎలా సెటప్ చేయాలి?
SEO టైప్స్ ఏంటి?
Rank math ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి?
SEO ఫ్రెండ్లీ గా కంటెంట్ ఎలా రాయాలి?
బ్లాగ్ సైట్ మ్యాప్ ని ఎలా సబ్మిట్ చేయాలి?
ఆఫ్ పేజ్ SEO

5. Social Media Optimization
సోషల్ మీడియాని ఎందుకు యూస్ చేయాలి?
ఫేస్ బుక్ పేజ్ ని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఆప్టిమైజ్ చేయాలి?
ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఆప్టిమైజ్ చేయాలి?
సోషల్ మీడియాలో కంటెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి?
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఎలా మేనేజ్ చేయాలి?

6. Analytics Analyzation
అనలిటిక్స్ ఎనలైజేషన్
గూగుల్ అనలిటిక్స్ ని ఎలా ఎనలైజ్ చేయాలి?
ఫేస్ బుక్ ఇన్ సైట్స్ ని ఎలా ఎనలైజ్ చేయాలి?
ఇన్స్టాగ్రామ్ ఇన్ సైట్స్ ని ఎలా ఎనలైజ్ చేయాలి?
యూట్యూబ్ అనలిటిక్స్ ని ఎలా ఎనలైజ్ చేయాలి?
అనలిటిక్స్ ఎనలైజేషన్ తో మనం ఏం చేయగలం.

7. Bonus Lectures
బ్లాగింగ్ గోల్స్
బ్లాగింగ్ ని బిజినెస్ లా ఎలా చేయాలి ?
బ్లాగింగ్ టైం మేనేజ్మెంట్
నెక్స్ట్ మనమేం చేయాలి?
బ్లాగ్ మానటైజేషన్

బ్లాగింగ్ ని ఒక ప్రొఫెషన్ లాగా చేయాలి అనుకునేవారికి, బ్లాగ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనుకునే వారికి ఈ కోర్స్ చక్కగా సరిపోతుంది. ఈ కోర్స్ బ్లాగింగ్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేనివారికైనా అర్థం అయ్యే విధంగా డిసైన్ చేయడం జరిగింది. కోడింగ్ రాకుండా బ్లాగింగ్ చేయడం ఇంపాజిబుల్ అనుకున్నాను కానీ ఈ కోర్స్ కంప్లీట్ చేశాక నేను బ్లాగింగ్ చేయగలను & నా బ్లాగ్ ద్వారా నేను మనీ ఎర్న్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది.

ఈ కోర్స్ డిసైన్ చేసిన Blogger VJ  గారు  బిగినర్స్ కి చాలా సపోర్ట్ ఇస్తారు. ఒక మంచి బ్లాగర్ గా మనల్ని తీర్చిదిద్దుతారు.

ఏంటి ఇవన్నీ నాకెలా తెలుసు అని అనుకుంటున్నారా? అవును నాకు తెలుసు ఎందుకంటే నేను ఈ Blogger Vj blogging course కంప్లీట్ చేశాను కాబట్టి. ఈ కోర్స్ కంప్లీట్ చేయడం వల్లే నా బ్లాగ్ ని నేనే స్వయంగా డిసైన్ చేసుకున్నాను. ఒక బ్లాగర్ గా ఇప్పుడు మీ ముందు వున్నాను. ఒకప్పుడు బ్లాగ్ పోస్ట్స్ చదవడం తప్ప కనీసం బ్లాగ్ పోస్ట్ ని షేర్ చేయడం కూడా రాని నేను బ్లాగర్ ని అయ్యాను అంటే దానికి కారణం ఈ కోర్సే.

నేను ఈ కోర్స్ కంప్లీట్ చేశాను అని చెప్పడం నిజమా? అబద్దమా? అని ఇంకా ఆలోచిస్తున్నారు కదా ? ఒకసారి కింద ఇమేజ్ లో చూడండి అక్కడ  NAYARA అని నా పేరు కూడా కనబడుతుంది.  ఇప్పటికయినా  అర్దం అయ్యిందా ?Blogging Cum Mini Digital Marketing Course

Blogger VJ Blogging Course Details తెలుసుకున్నారుగా ఇప్పుడు ఆలోచించుకోండి. మీరు తీసుకునే నిర్ణయం మీదే మీ భవిష్యత్తు ఆధారపడి వుంది. మీరు ఈ Blogger VJ Blogging cum mini digital marketing course లో ఎన్రోల్ అవ్వాలంటే ఇప్పుడే అవ్వండి. త్వరగా మీ బ్లాగింగ్ జర్నీ స్టార్ట్ చేయండి.

ముగింపు:

బ్లాగింగ్ గురించి ఏమీ తెలియని ఎలాంటి నాలెడ్జ్ లేని నేనే ఈ కోర్స్ వల్ల బ్లాగర్ ని అయ్యాను. మీరు నాకన్నా తెలివైన వారే అయ్యివుంటారు మరి మీరు ఎందుకు కాలేరు? ఖచ్చితంగా అవుతారు. మిమ్మల్ని మీరు నమ్మితే సాధించలేనిది ఏదీ లేదు.

మీకు ఈ పోస్ట్ నచ్చితే షేర్ చెయ్యండి. ఈ పోస్ట్ ఎంతవరకు యూస్ అయ్యిందో, ఇంకా ఏ కోర్స్ డీటైల్స్ కావాలో కింద కామెంట్ చెయ్యండి. కొత్త పోస్ట్స్ అప్డేట్స్ కావాలనుకుంటే బ్లాగ్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి. మళ్ళీ మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాను.


Response (2)
  1. M
    Mark September 7, 2022

    Thanks for your blog, nice to read. Do not stop.

    1. N
      Nayara September 24, 2022

      Thank you so much for your encouragement, Subscribe for future updates & new posts.

Leave a comment
Your email address will not be published. Required fields are marked *