Canva గురించి ముందు పోస్ట్ Best Online Courses in Telugu లో కొంత వరకు తెలుసుకున్నాం. అసలు ఈ Canva అనే దానిని ఎవరు ప్రారంభించారు అని అనుకుంటున్నారు కదూ ?
Canva ను ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జనవరి 1, 2012 న మెలానియా పెర్కిన్స్ ( Melanie Perkins ), క్లిఫ్ ఓబ్రేచ్ట్ ( Cliff Obrecht ) మరియు కామెరాన్ ఆడమ్స్ ( Cameron Adams ) స్థాపించారు. మొదటి సంవత్సరంలో Canva కు 750,000 మందికి పైగా వినియోగదారులు ఉన్నారు.
ఈ ప్లాట్‌ఫాం ఇప్పుడు 190 దేశాలలో 30 మిలియన్లకు పైగా మంత్లీ ఏక్టివ్ యూసర్స్ లను కలిగి ఉంది, వీరందరూ ఈ రోజు వరకు 3 బిలియన్ డిజైన్లను పైగా రూపొందించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాని యూస్ చేయని వారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో! మరి అలాంటి సోషల్ మీడియాలో రోజూ పోస్ట్ చేయడానికి కావలసిన ఇమేజెస్ కానీ ఇన్ఫో గ్రాఫిక్స్ కానీ వేరే ఏదైనా సరే డిసైన్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అంటే వున్న టైం అంతా దానికే సరిపోతుంది అని అంటారు.
కొంతమందికి ఫోటో షాప్ లాంటి గ్రాఫిక్ డిసైనింగ్ సాఫ్ట్వేర్ ని నేర్చుకోడానికే వున్న టైం సరిపోదు మరి అలాంటప్పుడు ఇంకెప్పుడు డిసైన్ చేయాలి అని అనుకుంటువుంటారు.
సోషల్ మీడియా పోస్ట్స్ ని డిసైన్ చేయడానికి వున్న అద్భుతమైన ఆప్షన్ Canva. కాన్వా అనేది ఆన్‌లైన్‌లో ఉపయోగించగల అందమైన గ్రాఫిక్‌లను రూపొందించడానికి ఎవరైనా ఉపయోగించగల ఉచిత ఆన్‌లైన్ డిజైన్ సాధనం.
ఇది సోషల్ మీడియాలో, వెబ్‌సైట్లలో, ఇమెయిల్‌లలో మొదలైనవి కావచ్చు. ఇందులో డిసైన్ చేయడం చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేయవచ్చు కాకపోతే మన డిసైన్స్ కొంచెం ప్రొఫెషనల్ గా వుండాలి అంటే తప్పకుండా Canva కోర్స్ చేయాలి.
మరి ఈ Canva కోర్స్ డీటైల్స్ తెలుసుకుందామా?
కోర్స్ రిక్వైర్మెంట్స్ : మంచి ఇంటర్నెట్ కనెక్షన్ తప్ప ఈ కోర్స్ కు ఎటువంటి అవసరాలు లేవు.
ఇందులో 13 లెసన్స్ వుంటాయి, వీడియో లెంగ్త్ 29m. కోర్స్ లాంగ్వేజ్ – ఇంగ్లీష్
1. Introduction
2. What is canva
3. Who is this class for
4. Getting Started
5. What you see when log in to Canva
6. Tools and Layouts
7. Elements
8. Text
9. Backgrounds
10. Uploads
11. Final Tools
12. Final Project
13. Tips & Tricks
ఈ కోర్స్ లో ముఖ్యంగా మనం తెలుసుకునేవి:
Canvaలో ఖాతాను ఎలా సెటప్ చేయాలి, ప్రాజెక్ట్ ను ఎలా ప్రారంభించాలి, Canva ఏ డిజైన్ సాధనాలను అందిస్తుంది అవి ఎక్కడ ఉన్నాయి మరియు వాటిని ఎలా ఉపయోగించాలి. ఇది పూర్తిగా బ్లాగర్లు మరియు చిన్న వ్యాపార యజమానులైన పూర్తిగా బిగినర్స్ కోసం.
అయినప్పటికీ, చిన్న ప్రాజెక్టుల కోసం ఉపయోగించడానికి సులువుగా వుండే దాని కోసం చూస్తున్న ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్లు కూడా ఈ కోర్స్ నుండి ప్రయోజనం పొందుతారు.
మరి ఇంకెందుకాలస్యం ఇప్పుడే ఈ Skillshare Free Canva Course లో జాయిన్ అయిపోయి మీరే స్వయంగా డిసైన్స్ రూపొందించండి.
ఈ కోర్స్ ఫ్రీ కాదు పెయిడ్ కోర్స్ . లాంగ్వేజ్ – ఇంగ్లీష్
కోర్స్ రిక్వైర్మెంట్స్ :
ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న కంప్యూటర్.
మునుపటి డిజైన్ అనుభవం అవసరం లేదు.
ఈ కోర్సు ఎవరి కోసం:
క్విక్, ప్రొఫెషనల్ క్వాలిటీ గ్రాఫిక్ డిసైన్స్ ఉచితంగా అవసరం అనుకునేవారికి.
ఖరీదైన, సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్ నేర్చుకోవడం కోసం గంటలు గంటలు గడపడానికి ఇష్టపడకుండా గ్రాఫిక్స్ క్రియేట్ చేయాల్సిన బిజినెస్ పీపుల్
సోషల్ మీడియాలో ప్రకటనలు చేయాలనుకునే వారికోసం.
లైఫ్ లాంగ్ స్కిల్స్ త్వరగా మరియు సులభంగా పొందాలనుకునే వారికోసం.
ఈ కోర్స్ లో 5 సెక్షన్స్, 33 లెసన్స్ వుంటాయి. టోటల్ వీడియో లెంగ్త్ 3h 40m.
Section 1: 12 లెసన్స్ 56 min
Section 2: 4 లెసన్స్ 25 min
Section 3: 7 లెసన్స్ 1hr 18min
Section 4: 8 లెసన్స్ 59min
Section 5: 2 లెసన్స్ 2min
ఈ కోర్స్ లో చెప్పే అన్ని వీడియోస్ గురించి నేను ఇక్కడ చెప్పడం లేదు కానీ మెయిన్ లెసన్స్ దేని గురించి వుంటాయో చెప్తున్నాను.
1. Open your Canva Account
2. Finding a template to work with
3. Backgrounds
4. Layers
5. Uploading, downloading & positioning
6. Groups & text
7. Frames & grids
8. Gradients
9. Editing Photos
10. Building our Facebook Cover Design
11. Reflection
12. Styles, Graphs
13. Making Websites using Canva
14. Adding Video, Music & Animation
15. An Introduction to Lumen5
కాన్వా యొక్క తాజా 3.0 సంస్కరణను ఉపయోగించి మీ కోసం ఉచితంగా, ప్రొఫెషనల్ లుకింగ్ గ్రాఫిక్ డిజైన్లను ఎలా తయారు చేయాలో మీరు త్వరగా తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఖరీదైన, సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను నేర్చుకోవడానికి గంటలు గంటలు గడపకుండా అద్భుతమైన గ్రాఫికల్ డిజైన్‌లను ఉత్పత్తి చేయాలనుకుంటున్నారా?
అయితే ఇప్పుడే ఈ Udemy Canva Course లో జాయిన్ అవ్వండి. ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిసైనర్ లాగా మీరే అద్బుతమైన డిసైన్స్ చేసేయండి.
కోర్స్ నేర్చుకోగానే మనకు డిసైనింగ్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది అని అనుకోకండి. మనం కోర్స్ చేశాక మనదైన శైలిలో కొత్త కొత్త డిసైన్స్ అందరికీ నచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తూ వుండాలి. దేనిలోనూ ఒకేసారి మనం ప్రొఫెషనల్స్ కాలేము. కొంత ప్రాక్టీస్, కొంత క్రియేటివిటీ వుండాలి కదా మరి ఏమంటారు?
మీకు ఈ పోస్ట్ నచ్చితే షేర్ చెయ్యండి. ఈ పోస్ట్ ఎంతవరకు యూస్ అయ్యిందో, ఇంకా ఏ కోర్స్ డీటైల్స్ కావాలో కింద కామెంట్ చెయ్యండి. కొత్త పోస్ట్స్ అప్డేట్స్ కావాలనుకుంటే బ్లాగ్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి. మళ్ళీ మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాను.