Cinematography Course Details In Telugu

N

Cinematography Course Details

ఈ సినిమాటోగ్రఫీ కోర్స్ గురించి మనం ముందు పోస్ట్ బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ తెలుగులో అనే పోస్ట్ లో కొంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం డీటైల్డ్ గా తెలుసుకుందాం.

సినిమా మరియు వాణిజ్యపరిశ్రమ వ్యాపారం బాగా విస్తరించడంతో , సినిమాటోగ్రాఫర్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం వున్న పోటీని తట్టుకోవాలంటే ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తులు మొదటి నుండి మొదలుపెట్టి, ఒక మంచి ప్రొఫెషనల్‌గా మారడానికి భారీ నైపుణ్యాలను సంపాదించాలి. అప్పుడే మనకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది.

సినిమాటోగ్రఫీ అనేది ఒక కథను దృశ్యమానంగా సంగ్రహించడం ద్వారా చలన చిత్రాలను రూపొందించే కళ మరియు నైపుణ్యం. సింపుల్ గా చెప్పాలంటే ఒక కథ ( స్టోరీ ) ని మనం చూడడానికి వీలుగా మనకి అర్ధం అయ్యే విధంగా ఒక మూవీలాగా లేక ఒక వీడియో లాగా చేయడాన్నే సినిమాటోగ్రఫీ అంటారు.

సినిమాటోగ్రఫీ అనేది విజువల్ ఎలిమెంట్‌లను నిర్వహించే సినిమా నిర్మాణంలో ఒక అంతర్భాగం. ఒక సినిమాకి సినిమాటోగ్రఫీ సరిగ్గా లేకపోతే ఆ సినిమా ఏ మాత్రం విజయం సాధించలేదు. సినిమాటోగ్రఫీ అనేది సులువుగా అనిపిస్తుంది కానీ అది అనుకున్నంత సులువు కాదు అనేది తర్వాత మనకు అర్ధం అవుతుంది.

Cinematography Course Details

 

1. సినిమాటోగ్రాఫర్ ఏమి చేస్తారు?

సినిమాటోగ్రాఫర్ నే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ( DP లేదా DOP) అని అంటారు. సినిమాటోగ్రాఫర్ ఒక సినిమా లేదా వీడియో ప్రొడక్షన్‌లో కెమెరా మరియు లైట్ సిబ్బందికి అధ్యక్షత వహించే ఒక నాయకుడన్నమాట. వీరు మొత్తం సినిమా/వీడియో నిర్మాణంలో పాలుపంచుకుంటారు మరియు మనం చూసే చిత్రాలను రూపొందించడానికి దర్శకుడితో కలిసి పనిచేస్తారు.

అంటే ఒక దర్శకుడు ఎలాంటి చిత్రం అయితే తీయాలనుకుంటాడో అది అర్థం చేసుకుని అతని ఆలోచనలకు తగినట్లుగా సినిమా వచ్చేలా చేయడం ఒక సినిమాటోగ్రాఫర్ పని.

2. సినిమాటోగ్రాఫర్ ఏ అంశాలను పరిశీలిస్తారు?

 • Camera placement
 • Camera movement
 • Shot Composition
 • Shot Size
 • Focus
 • Lighting
 • Camera Gear

ఒక సీన్ బాగా రావాలంటే షూటింగ్ జరిగే ప్లేస్ లేదా లొకేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్ ని ఆర్టిస్ట్స్ ఎక్స్ ప్రెషన్స్ ని బాగా కవర్ చేయగలగాలి & లైటింగ్ కూడా పర్ఫెక్ట్ గా వుండేలా చూసుకోవాలి. లైటింగ్ పర్ఫెక్ట్ గా లేకపోతే ఆర్టిస్టులు ఎంత బాగా నటించిన ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే లైటింగ్ కి విడిగా లైట్ బాయ్స్ వున్నా వారిని సరిగ్గా లీడ్ చేయాల్సింది మాత్రం సినిమాటోగ్రాఫరె.

ఒక్కో సీన్ కి కెమెరా ఒక్కో యాంగిల్ లో వుంచాల్సి వస్తుంది. ఆ యాంగిల్ సరిగ్గా వుంటేనే షాట్ అద్భుతంగా వస్తుంది. ఏ సీన్స్ కి కెమెరా మూవ్ చేయాలి ఏ సీన్స్ కి ఒకే ప్లేస్ లో వుంచాలి. ఒక షాట్ కి కావలసిన ఎక్యూప్మెంట్స్ ఏమేమి కావాలి ఇలా అన్నీ కూడా చూసుకునే బాధ్యత సినిమాటోగ్రాఫర్ కి వుంటుంది.

సినిమాటోగ్రఫీ కోర్స్ చేస్తే ఒక సినిమాటోగ్రాఫర్ కావాలంటే ఏమేం తెలిసివుండాలో మనకు ఒక క్లారిటీ వస్తుంది.

3. Skillshare Cinematography Course Details

ఈ స్కిల్ షేర్ సినిమాటోగ్రఫీ కోర్స్ ఎవరి కోసం :

మీరు మీ వీడియోలను సరికొత్త స్థాయికి తీసుకువెళ్ళాలనుకుంటే, మీ సోషల్ మీడియా కంటెంట్‌ని పెంపొందించుకోవాలి అనుకుంటుంటే లేదా ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫీలో మీ కెరీర్‌ని ప్రారంభించాలి అని అనుకుంటుంటే, ఇది మీకోసమే!

ఈ కోర్స్ లో 30 లెసన్స్ వుంటాయి. టైమింగ్ 1h 14m. లాంగ్వేజ్ : ఇంగ్లీష్

ఈ కోర్స్ లో మనం నేర్చుకోబోయే వాటిలో ముఖ్యమైనవి:

 • సినిమాటోగ్రఫీ అంటే ఏమిటి?
 • వీడియో రిజల్యూషన్ అంటే ఏమిటి?
 • ఫ్రేమ్ రేటును అర్థం చేసుకోవడం
 • లెన్స్‌లు & ఫీల్డ్ యొక్క డెప్త్
 • DSLR: రిజల్యూషన్ మరియు ఫ్రేమ్ రేటును ఎలా మార్చాలి
 • ఐఫోన్: రిజల్యూషన్ మరియు ఫ్రేమ్ రేటును ఎలా మార్చాలి
 • అపర్చుర్ ( Aperture ) & షట్టర్ స్పీడ్
 • షాట్ కంపోసిషన్
 • స్టోరీ టెల్లింగ్
 • లైటింగ్ సెట్టింగ్ ఫర్ ఇండోర్ షూటింగ్

ఈ కోర్సు మీకు ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్‌లా షూట్ చేయాల్సిన ప్రొఫెషనల్ నాలెడ్జ్‌ను అందిస్తుంది మరియు ఖరీదైన ఎక్యూప్మెంట్స్ వేలాది డాలర్లు ఖర్చు చేయకుండా మీరు ఈరోజు ప్రాక్టీస్ ప్రారంభించవచ్చు. ఇది DSLR కెమెరాలు మరియు స్మార్ట్‌ఫోన్‌ల కోసం రూపొందించబడింది కాబట్టి మీరు వెంటనే ప్రారంభించవచ్చు. మరి ఇప్పుడే ఈ స్కిల్ షేర్ సినిమాటోగ్రఫీ కోర్స్ లో జాయిన్ అయ్యి మంచి సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చెయ్యండి.

4. Udemy Cinematography Course Details

ఈ udemy సినిమాటోగ్రఫీ కోర్స్ ఎవరి కోసం :

 • తమ కెమెరాతో మెరుగైన వీడియోలను షూట్ చేయాలనుకుంటున్న వారికోసం
 • వీడియోలను షూట్ చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనుకునే వారికోసం
 • సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలనుకునే వారికోసం
 • ఎవరైనా ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ వంటి కెమెరాలను ఉపయోగించాలనుకునే వారికోసం

ఈ కోర్స్ లో మొత్తం 12 సెక్షన్స్, 81 లెక్చర్స్ ఉంటాయి. టైమింగ్ 3h 15m, కోర్స్ లాంగ్వేజ్: ఇంగ్లీష్

ఈ కోర్స్ లో మనం నేర్చుకోబోయే వాటిలో ముఖ్యమైనవి:

 • సినిమాటోగ్రాఫర్ అంటే ఏమిటి?
 • డిజిటల్ కెమెరాను ఎంచుకోవడం
 • వీడియో రిజల్యూషన్ అంటే ఏమిటి?
 • ఫ్రేమ్ రేట్ అంటే ఏమిటి?
 • లెన్స్‌ని ఎంచుకోవడం
 • ఎక్స్‌పోజర్ ఎలా పని చేస్తుంది?
 • షాట్స్ ఎన్ని రకాలు?
 • డాక్యుమెంటరీల కోసం మెరుగైన షాట్‌లను కంపోజ్ చేయడం
 • మెరుగైన వీడియో కోసం ట్రైపాడ్ ఉపయోగించడం
 • మెరుగైన వీడియో కోసం డాలీ ( Dolly )ని ఉపయోగించడం
 • డ్రోన్‌తో షూటింగ్ ఎలా చేయాలి?
 • లైటింగ్ అంటే ఏమిటి?
 • మీ కెమెరాలో వైట్ బ్యాలెన్స్ సెట్ చేసుకోవడం
 • 3-పాయింట్ లైటింగ్‌ను ఎలా సెటప్ చేయాలి?
 • నేచురల్ లైటింగ్ తో షూటింగ్ ఎలా చేయాలి?
 • సినిమాటోగ్రఫీ వర్క్ ను కనుగొనడానికి అగ్ర మార్గాలు

ఈ కోర్స్ పూర్తి చేస్తే మీ ఐ ఫోన్ తో నైనా లేక కెమెరా తో నైనా సరే ఇండోర్ లోనైనా అవుట్ డోర్ లోనైనా అందమైన వీడియోలు చక్కగా తీయగలరు. ఒక సినిమాటోగ్రాఫర్ గా మీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఈ కోర్స్ కూడా ఒక మంచి ఎంపిక. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ udemy సినిమాటోగ్రఫీ కోర్స్ లో జాయిన్ అవ్వండి.

ముగింపు:

సినిమాటోగ్రఫీ అంటే లైటింగ్, ఫ్రేమింగ్, కంపోజిషన్, కెమెరా మోషన్ & యాంగిల్స్, ఫిల్మ్ సెలెక్షన్, లెన్స్ సెలక్షన్ , జూమ్, ఫోకస్, కలర్, ఎక్స్‌పోజర్ మరియు ఫిల్ట్రేషన్‌తో సహా అన్ని ఆన్-స్క్రీన్ విజువల్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది. ఇది నేర్చుకోవడం ఒక సినిమాటోగ్రాఫర్ గా సెటిల్ అవ్వడం కొంచెం కష్టమే కానీ ఇష్టం గా చేస్తే ఏది కష్టం కాదు కదా!

మీకు ఈ పోస్ట్ నచ్చితే షేర్ చెయ్యండి. ఈ పోస్ట్ ఎంతవరకు యూస్ అయ్యిందో, ఇంకా ఏ కోర్స్ డీటైల్స్ కావాలో కింద కామెంట్ చెయ్యండి. కొత్త పోస్ట్స్ అప్డేట్స్ కావాలనుకుంటే బ్లాగ్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి. మళ్ళీ మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాను.


Response (2)
 1. This post is extremely radiant. I extremely like this post. It is outstanding amongst other posts that I’ve read in quite a while. Much obliged for this better than average post. I truly value it!

  1. N
   Nayara July 23, 2022

   Thank you so much for reading & commenting on my post. Subscribe for future updates & new posts.

Leave a comment
Your email address will not be published. Required fields are marked *