Digital Marketing Course Details In Telugu

N

Digital Marketing Course Details

డిజిటల్ మార్కెటింగ్ గురించి మనం కొంతవరకు బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ అనే పోస్ట్ లో కొంచెం తెలుసుకున్నాం. ఈ పోస్ట్స్ లో ఇంకొంచెం డీటైల్డ్ గా తెలుసుకుందాం.

చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ అంటే కేవలం యాడ్స్ ద్వారా ప్రొడక్ట్స్ సేల్ చేయడం లేదా బ్రాండింగ్ అని అనుకుంటారు. అలా అనుకుని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేసి తర్వాత జాబ్ కోసం ట్రై చేసి వాళ్ళు అడిగే వాటికి సరిగ్గా సమాధానం చెప్పలేక కొందరు, జాబ్ వచ్చాక అందులో కొనసాగలేక వున్న కాంపిటీషన్ ని తట్టుకోలేక, తమకంటూ ప్రత్యేక స్థానం సంపాధించుకోలేక కొందరు ఇబ్బందులు పడుతూ ఉంటారు.

అందుకని మనం ఈ పోస్ట్ లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ డీటైల్స్ తో పాటు అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? దానివల్ల వుండే లాభాలు ఏమిటి? డిజిటల్ మార్కెటర్స్ కి వుండాల్సిన స్కిల్స్ ఏమిటి? డిజిటల్ మార్కెటింగ్ & ఆన్‌లైన్ మార్కెటింగ్ ఒకటేనా?

ఇలా డిజిటల్ మార్కెటింగ్ గురించిన వివరాలు కొన్ని తెలుసుకుని తర్వాత ఆ కోర్స్ నేర్చుకుంటే మనకు బాగా అర్దం అవుతుంది.

1.డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?

ఏవైనా ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ కస్టమర్స్ ను చేరుకోవడానికి బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నిర్వహించే మార్కెటింగ్ పద్ధతులని డిజిటల్ మార్కెటింగ్ అంటారు.

ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఎవరో ఒకరిద్దరి దగ్గర మాత్రమే వుండేవి కానీ ఇప్పుడు అందరూ అవే వాడుతున్నారు. కంప్యూటర్స్ & లాప్టాప్స్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర వుండాల్సిన పరిస్థితి వచ్చింది. దీని కారణంగానే ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. మనకు ఏది కావాలన్నా దానికోసం ఆన్లైన్ లో సెర్చ్ చేయడం అందరికీ అలవాటు అయిపోయింది.

అంటే మన బిజినెస్ కానీ సర్వీసెస్ కానీ బాగా డవలప్ అవ్వాలంటే అది ఖచ్చితంగా ఆన్లైన్ లో వుండి తీరాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న డిజిటల్ యుగం కారణంగా, ఈ డిజిటల్ మార్కెటింగ్ రంగం మనం ఊహించలేని విధంగా బాగా ప్రాచుర్యం పొందింది. డిజిటల్ మార్కెటింగ్ అనేది అత్యంత డిమాండ్ ఉన్న కెరీర్ ఆప్షన్స్ లో ఒకటి.

ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోడానికి పట్టే టైం తక్కువే కావచ్చు కానీ మనం నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయడానికీ, ఏ స్ట్రాటజీ ఎలా వర్కవుట్ అవుతుందో తెలియడానికి చాలా టైం పడుతుంది. ఒక్కోసారి మనం బాగా క్లిక్ అవుతుంది అనుకున్న స్ట్రాటజీ పూర్తిగా ఫెయిల్ అవ్వొచ్చు. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా ?

“Failure is simply the opportunity to begin again, this time more intelligently.” – Henry Ford

అంటే వైఫల్యం అనేది మళ్లీ ప్రారంభించడానికి ఒక అవకాశం, కాకపోతే ఈసారి మరింత తెలివిగా ప్రయత్నించాలి. ఏ రంగంలో నైనా మనం అభివృద్ది చెందాలి అంటే ఫెయిల్యూర్ అనేది మన సక్సెస్ కి ఒక స్పీడ్ బ్రేకర్ లా అనుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అంతే కానీ నిరాశకు లోనయ్యి ఆగిపోకూడదు.

2.డిజిటల్ మార్కెటింగ్ vs ఆన్‌లైన్ మార్కెటింగ్

డిజిటల్ మార్కెటింగ్ & ఆన్లైన్ మార్కెటింగ్ అనేవి రెండూ ఒకటే అని చాలా మంది అనుకుంటూ వుంటారు. కాకపోతే రెండిటికి చిన్న తేడా వుంది.

డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంటర్ నెట్ ద్వారాను & ఇంటర్ నెట్ లేకుండా కూడా చేస్తారు. అంటే ఆన్లైన్ & ఆఫ్లైన్ మార్కెటింగ్ అన్నమాట.

ఆన్లైన్ మార్కెటింగ్ అనేది కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే చేస్తారు. ఇంటర్నెట్ లేకుండా చేయలేరు. అంటే ఇది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక భాగమే కానీ డిజిటల్ మార్కెటింగ్ & ఆన్లైన్ మార్కెటింగ్ ఒకటి కాదు.

మరి డిజిటల్ మార్కెటింగ్ లో ఆన్లైన్ ద్వారా & ఆఫ్లైన్ ద్వారా ఏ ప్లాట్ఫారమ్స్ ద్వారా మార్కెటింగ్ చేస్తారు అని అనుకుంటున్నారా? అది కూడా ఇప్పుడే తెలిసేసుకుందాం!

    2.1 Digital marketing: Online Marketing Channels

 • SEO ( Search Engine Optimization )
 • PPC ( Pay-Per-Click )
 • Content Marketing
 • Email Marketing
 • Social Media Marketing
 • Affiliate Marketing
 • Smart Phone Marketing
 • Video Marketing

    2.2 Digital marketing: Offline Marketing Channels

 • TV Marketing
 • SMS Marketing
 • Radio Marketing
 • Billboard Marketing

3. డిజిటల్ మార్కెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

డిజిటల్ మార్కెటింగ్‌తో, మీరు మీ వ్యాపారంలో ఆసక్తి ఉన్న వ్యక్తులను చేరుతారు. ఈ మార్కెటింగ్ పద్ధతులు ద్వారా మీ ఉత్పత్తులు లేదా సేవలను కోరుకునే వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవచ్చు.

మీ ఉత్పత్తులు మరియు సేవల కోసం చూస్తున్న వ్యక్తులను చేరుకోవడం ద్వారా మీ వ్యాపారం కోసం కొత్త ట్రాఫిక్, లీడ్స్ మరియు సేల్స్ ను పొందడంలో మీకు సహాయపడటమే డిజిటల్ మార్కెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం.

మీరు ఎప్పుడైనా ఒక న్యూస్ పేపర్ లో ఒక యాడ్ ఇచ్చినట్లయితే , ఎంతమంది వ్యక్తులు ఆ పేపర్ లో మీ యాడ్ ని చూశారో అంచనా వేయడం మరియు ఏవైనా అమ్మకాలు ఆ ప్రకటన ద్వారా జరిగాయో లేదో తెలుసుకోవడానికి ఖచ్చితమైన మార్గం అంటూ ఏదీ లేదు.

పైగా మీ యాడ్ పలాన వయస్సు వాళ్ళు మాత్రమే చూడాలి అని కానీ లేడీస్ లేదా జెంట్స్ ఎవరో ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేయడం అనేది కుదిరే పని కాదు.

అదే డిజిటల్ మార్కెటింగ్ లో అయితే మీకు ఏజ్, జెండర్, లొకేషన్ ఇలా విడివిడిగా కావలసిన విధంగా టార్గెట్ చేసుకునే అవకాశం వుంటుంది.

అంతే కాకుండా మన యాడ్ ని ఎంత మంది చూశారు, కంపెనీకి సంబంధించిన ఇంప్రెషన్‌లు, షేర్లు, క్లిక్‌లు, సేల్స్ మరియు మన పేజీలో వాళ్ళు స్పెండ్ చేసిన టైమింగ్ తో సహా అన్నీ కూడా చాలా క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ యొక్క అతిపెద్ద ప్రయోజనాల్లో ఇది ఒకటి.

4. డిజిటల్ మార్కెటింగ్ అన్ని వ్యాపారాలకు పని చేస్తుందా?

డిజిటల్ మార్కెటింగ్ ఏ పరిశ్రమలోని ఏ వ్యాపారం కోసమైనా పని చేస్తుంది. మీ కంపెనీ ఏ ప్రొడక్ట్ సేల్ చేస్తుంది అనే దానితో సంబంధం లేకుండా, డిజిటల్ మార్కెటింగ్‌లో మీ ఆడియన్స్ లేదా కస్టమర్స్ అవసరాలను గుర్తించడానికి మరియు విలువైన ఆన్‌లైన్ కంటెంట్‌ను సృష్టించడం కోసమే కాకుండా వారి వ్యక్తిత్వాలను తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది. అయితే, అన్ని వ్యాపారాలకు ఒకే విధంగా డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాన్ని( స్ట్రాటజీ ) అమలు చేయాలని లేదు.

ఒక్కో బిజినెస్ కి ఒక్కో స్ట్రాటజీ యూస్ చేయాల్సి వస్తుంది. బిజినెస్ ని బట్టి స్ట్రాటజీ మారుతుంది కానీ దాదాపుగా అన్నీ బిజినెస్ లకి డిజిటల్ మార్కెటింగ్ యూస్ అవుతుంది.

5. డిజిటల్ మార్కెటింగ్ కోసం ఏ నైపుణ్యాలు అవసరం?

digital marketing skills

డిజిటల్ మార్కెటింగ్ కోసం అవసరం అయిన టాప్ 10 స్కిల్స్:

 1. SEO & SEM ( Search Engine Optimization & Search Engine Marketing )
 2. Data Analysis
 3. Social Media
 4. Email Marketing
 5. Content Marketing
 6. Design Skills
 7. HTML & CSS
 8. Project Leadership
 9. Sales and Persuasion
 10. CRM ( Customer Relationship Management )

6. Google Digital Unlocked – Free Digital Marketing Course Details:

Google Digital Unlocked – Free Digital Marketing Course Details

గూగుల్ “ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ” అనే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ని ఫ్రీ గా అందిస్తుంది. ఈ కోర్స్ బిగినర్స్ కోసం, ఇందులో 26 మాడ్యూల్స్ వుంటాయి. టైమింగ్ వచ్చేసి 40 గంటలు. కోర్స్ పూర్తి చేశాక మనకి సర్టిఫికెట్ కూడా వస్తుంది.

ఇందులో ఈ 7 టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది.

 • Take a business online
 • Make it easy for people to find a business on the web
 • Reach more people locally, on social media or on mobile
 • Reach more customers with advertising
 • Track and measure web traffic
 • Sell products or services online
 • Take a business global

ఆన్లైన్ లో ఎలా బిజినెస్ చేయాలి ? కస్టమర్స్ సులువుగా మన బిజినెస్ ని ఈజీగా కనుగొనేలా ఎలా చేయాలి? సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది కస్టమర్స్ ను ఎలా రీచ్ అవ్వాలి? యాడ్స్ ద్వారా కస్టమర్స్ ను ఎలా రీచ్ అవ్వాలి? మన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ఎలా సేల్ చేయాలి ? ఇలా అనేక మైన విషయాల గురించి ఈ కోర్స్ లో నేర్చుకోవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏమీ తెలియని వాళ్ళు ఈ కోర్స్ తో స్టార్ట్ చేయడం మంచిది. మరి ఇప్పుడే ఈ గూగుల్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరీర్ కి మొదటి అడుగు ఇక్కడినుండి స్టార్ట్ చేయండి.

7. Udemy Free Digital Marketing Basics Course Details:

Udemy Free Digital Marketing Basics Course Details

ఈ కోర్స్ కూడా బిగినర్స్ కోసమే. ఇందులో 3 సెక్షన్స్, 22 లెక్చర్స్ వుంటాయి. టైమింగ్ : 5 గంటల 45 నిమిషాలు. దీనికి సర్టిఫికెట్ అయితే ఇవ్వడం జరగదు.

ఈ కోర్స్ లో మనం ఏమి నేర్చుకుంటాం?

 • Basics of Digital Marketing
 • Hand-on approach to running paid ads
 • Understanding email marketing and landing pages.
 • Understanding social media strategies using case-studies
 • How to grow your Instagram Followers
 • How to use whatsapp for business
 • How to generate organic leads on social media

డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ ఏమిటి? పెయిడ్ యాడ్స్ రన్ చేయాడం ఎలా? ఇమెయిల్ మార్కెటింగ్ మరియు ల్యాండింగ్ పేజెస్ ని ఎలా అర్దం చేసుకోవాలి? ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని ఎలా పెంచుకోవాలి? బిజినెస్ కోసం వాట్సప్ ని ఎలా యూస్ చేయాలి? సోషల్ మీడియాలో ఆర్గానిక్ లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి? అనే విషయాల గురించి క్లియర్ గా ఈ కోర్స్ లో నేర్చుకోవచ్చు.

మరి ఇంకెందుకాలస్యం ఇప్పుడే ఈ udemy ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వండి.

8. Udemy Mega Digital Marketing Course Details:Udemy Mega Digital Marketing Course Details

ఇది మాత్రం ఫ్రీ కోర్స్ కాదు పెయిడ్ కోర్స్. ఇందులో 54 సెక్షన్స్ 392 లెక్చర్స్ వుంటాయి. టైమింగ్ 56 గంటలు. కోర్స్ కంప్లీట్ అయ్యాక సర్టిఫికెట్ ఇస్తారు.

ఈ కోర్సు ఎవరి కోసం:

 • తమ సైట్‌కు ట్రాఫిక్ తీసుకురావడానికి లేదా ప్రొడక్ట్స్ ను సేల్ చేయడానికి కష్టపడుతున్న వ్యాపారవేత్తలు
 • డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని ప్రారంభించాలనుకునే వ్యక్తులు
 • డిజిటల్ మార్కెటింగ్ నిష్ లో ఫ్రీలాన్సర్‌గా పని చేయాలనుకునే వ్యక్తులు
 • బిజినెస్ & మార్కెటింగ్‌లో వెబ్‌సైట్ అవసరమైన వ్యక్తులు

ఈ కోర్స్ లో మనం ఏమి నేర్చుకుంటాం?

 • Create a powerful WordPress website
 • Create slider, call to actions, landing pages
 • Digital marketing strategies
 • Mailchimp for email marketing
 • Copywriting to write a powerful blog
 • How to become a story teller
 • SEO
 • Keyword research
 • Work with search engins
 • Use automation tools
 • Instagram ads
 • Facebook ads
 • Complete Google Analytics

కోడింగ్ అవసరం లేకుండా సమర్థవంతమైన వెబ్‌సైట్‌ను రూపొందించడం, మీ టార్గెట్ ఆడియన్స్ ను కనుగొనడం, అధునాతన ల్యాండింగ్ పేజీలను నిర్మించడం, విజయవంతమైన ఇమెయిల్ మార్కెటింగ్ చేయడం, సోషల్ మీడియా మార్కెటింగ్‌లో మాస్టర్ అవ్వడం, రీటార్గెటింగ్.

డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాల గురించి పవర్ఫుల్ నాలెడ్జ్ ను సంపాదించడం, గూగుల్ & ఇతర సెర్చ్ ఇంజిన్‌ల మొదటి పేజీలో ర్యాంక్ చేయడం, విభిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విజయవంతమైన ప్రకటన ప్రచారాలను చేయడం ద్వారా మరింత మంది కస్టమర్‌లను పొందడం ఇంకా ఇంకా చాలా విషయాలు ఈ కోర్స్ లో నేర్చుకోవచ్చు.

మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి డీటైల్డ్ గా తెలుసుకోవాలి అంటే ఈ కోర్స్ మీకు అద్బుతమైన ఎంపిక. మరి ఇంక ఏమీ ఆలోచించకుండా ఈ Udemy మెగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వండి.

ముగింపు:

ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వారికి చాలా మంచి ఫ్యూచర్ వుంది అని అందరూ చెప్తున్నారు. నిజమే కాకపోతే కేవలం కోర్సెస్ మాత్రమే కంప్లీట్ చేస్తే అంతగా ఉపయోగం వుండదు. ఆడియన్స్ మైండ్ సెట్ ని తెలుసుకోగలగాలి, ఎప్పటికప్పుడు ఒక డిజిటల్ మార్కెటర్ కి అవసరమైన స్కిల్స్ ని డవలప్ చేసుకుంటూ అప్డేట్స్ ని ఫాలో అవుతూ వుండాలి.

డిఫరెంట్ స్ట్రాటజీస్ ట్రై చేస్తూ ఏవి కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయో అబ్సర్వ్ చేస్తూ చాలా కాన్సంట్రేటెడ్ గా వుంటే మీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవచ్చు.

మీకు ఈ పోస్ట్ నచ్చితే షేర్ చెయ్యండి. ఈ పోస్ట్ ఎంతవరకు యూస్ అయ్యిందో, ఇంకా ఏ కోర్స్ డీటైల్స్ కావాలో కింద కామెంట్ చెయ్యండి. కొత్త పోస్ట్స్ అప్డేట్స్ కావాలనుకుంటే బ్లాగ్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి. మళ్ళీ మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాను


Response (6)
 1. N
  Naveen April 9, 2022

  Pls share your contact details or else call us 8328350490 for details

  1. N
   Nayara April 11, 2022

   ok i will call you sir

 2. S
  Sindhuja August 10, 2022

  Hi mam, after reading this article I must say you are the best content writer, because I doesn’t seen this kind of informative article.

  1. N
   Nayara September 8, 2022

   Thank you so much Sindhuja, follow for new updates & new articles.

Leave a comment
Your email address will not be published. Required fields are marked *