How To Be Successful In Life In Telugu

N

How To Be Successful In Life In Telugu

Successful అంటే విజయవంతం. సక్సెస్ఫుల్ అవ్వడం ఎలా అని ఆలోచించని వారు ఎవ్వరూ వుండరు కానీ సక్సెస్ అవ్వడం అంత సులభం కాదు. సక్సెస్ అనే పదం పలకడం చాలా ఈజీగాను, ఇష్టం గాను వుంటుంది కానీ మనం సక్సెస్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టపడాలి.

కొన్నిసార్లు మనకెదురయ్యే పరిస్థితులనిబట్టి అసలు జీవితంలో సక్సెస్ అవ్వగలమా అనే డౌట్ కూడా వస్తుంది.

ఎంతో మంది వాళ్ళు అనుకున్నవన్నీ సాధించగలుగుతున్నారు, నేనెందుకు సాధించలేకపోతున్నాను? ఇలా నా మనసులో నేను కూడా చాలా సార్లు అనుకున్నాను.

అప్పుడు నా మనసు నన్ను ఒక ప్రశ్న వేసింది. అదేంటంటే అసలు నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏమిటి? హ .. హ.. సక్సెస్ అంటే ఏంటో తెలీదా? మనం చేయాలనుకున్నవి అన్నీ చేయగలగడం, అందరూ మనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే స్థాయికి ఎదగడం అంతే కదా! అనుకున్నాను. కానీ నిజానికి సక్సెస్ అంటే అది కాదు! మరి ఇంకేమిటి అని ఆలోచిస్తున్నారా?

చాలా మంది ప్రజలు మంచి జాబ్, మనీ, ప్రాపర్టీ, మరియు తోటివారి నుండి బాగా గౌరవం కలిగివుంటే దాన్నే సక్సెస్ గా భావిస్తారు. కానీ సంతోషకరమైన జీవితానికి అవసరమయ్యే లక్ష్యాలను పట్టించుకోరు.

కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం, శారీరక మరియు మానసిక ఆరోగ్యం, భద్రత, ఇతరులకు సహాయం చేయడం, మన క్రియేటివిటిని మెరుగుపరుచుకోవడం, ఉన్నంతలో ఆనందంగా వుండడం, కష్టాలకి క్రుంగిపోకుండా మనో ధైర్యంతో వుండడం ఇవన్నీ కూడా సక్సెస్ లో భాగమే.

అవునంటారా? కాదంటారా? మీరే ఆలోచించుకోండి.

12 టిప్స్ ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్ 

1.  Planning ( ప్రణాళిక )
2. Work Hard  ( బాగా కష్టపడు )
3. Goals ( లక్ష్యాలు )
4. Good Habits ( మంచి అలవాట్లు )
5. Create Ideas ( ఆలోచనలను సృష్టించండి )
6. Willpower ( సంకల్పశక్తి )
7. Emotional Intelligence ( హావభావాల తెలివి )
8. Think positively ( సానుకూలంగా ఆలోచించండి )
9. Mental Strength ( మానసిక బలం )
10. Be Persistent ( పట్టుదలతో ఉండండి )
11. How to Say No ( లేదు అని చెప్పడం ఎలా )
12. Take away distractions ( పరధ్యానం తొలగించండి )

1. How To Be Successful In Life | Planning

అందరికీ రోజుకి వుండే టైం 24 గంటలే కానీ కొంతమంది అనుకున్నవి చేయడంలో సక్సెస్ అవుతున్నారు కొంతమంది ఫెయిల్ అవుతున్నారు ఎందుకని అంటే సరైన ప్లానింగ్ లేకపోవడమే.

లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ప్లానింగ్ (ప్రణాళిక) అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాము అనేదానికన్నా మన ప్లాన్ కరెక్టా కాదా అనేది ముఖ్యం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంకా ఇంకా ముఖ్యం.

అంతే కాదు మనం ప్లాన్ వేసుకునేటప్పుడు ఒక విషయం మర్చిపోకూడదు అదేంటంటే కోపంలో వున్నప్పుడు మాత్రం ఎలాంటి ప్లాన్స్ వేసుకోకూడదు. అంతే కాదు మన ప్లాన్ కరెక్టా కాదా అనే సందేహం కూడా వుండకూడదు.

ఒకసారి వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయితే వెంటనే ఆ ప్లాన్ ని మార్చేయకండి, అందులో వున్న మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకుని వాటిని చేంజ్ చేసి మళ్ళీ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయండి.

2. How To Be Successful In Life | Work Hard

అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకంటే కష్టాన్ని నమ్ముకున్నవాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు అనే మాట నేను అనడం లేదు ఎంతో మంది సక్సెస్ అయిన వారి జీవితాలను గమనిస్తే మనకి అర్దం అవుతుంది. ఒకసారి సక్సెస్ అయ్యాక ఇంక చాల్లే అని అనుకోకండి ఎందుకంటే?

“Don’t take rest after your first victory because if you fail in second, more lips are waiting to say that your first victory was just luck”.
“మీ మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోకండి, ఎందుకంటే మీరు రెండవ సారి  విఫలమైతే, మీ మొదటి విజయం కేవలం అదృష్టం అని చెప్పడానికి ఎక్కువ పెదవులు వేచి ఉన్నాయి”  —  APJ Abdul Kalam

కష్టపడి పనిచేయాలి కానీ చేసే పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలి. కొంత మంది కష్టమైన పనిని కూడా చాలా ఈజీగా చేసినట్లు అనిపిస్తుంది కదా ఎందుకో తెలుసా? వాళ్ళకి పనిచేసే విధానం తెలుసు కాబట్టి.

అంటే ఏంటి? ఇప్పుడు మాకు పనిచేసే విధానం తెలియదా అని ఫీల్ అవ్వకండి.

మనం చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో ప్రతీ విషయము ఎవరినో ఒకరిని చూసే నేర్చుకుంటాము కానీ కొంచెం పెద్దయ్యాక అన్నీ నాకు తెలుసు నాకు ఎవరు ఏమీ చెప్పనవసరం లేదు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చాలాసార్లు నష్టపోతాము.

మన ఆలోచనా విధానం మారితే మన జీవితం కూడా మారిపోతుంది.

3. How To Be Successful In Life | Goals

గోల్స్ అంటే లక్ష్యాలు. అసలు గోల్స్ ఎందుకు పెట్టుకోవాలి ? గోల్స్ పెట్టుకోకపోతే మనం ఏమీ సాధించలేమా? ఇది చాలా మంది అనుకునే ప్రశ్న?

లక్ష్యం లేని జీవితం, గాలికి ఎగిరే గాలిపటంతో సమానం. గాలిపటం ఎలా అయితే గాలికి ఎటుపడితే అటు పోతుందో లక్ష్యం లేని జీవితం కూడా అలాగే వుంటుంది. అందుకే మన జీవితంలో సక్సెస్ అనేది రావాలంటే ఖచ్చితంగా గోల్స్ పెట్టుకోవాలి.

గోల్స్ పెట్టుకోవడం వల్ల మన ప్రవర్తనలో కూడా చాలా మార్పు వస్తుంది. నిర్లక్ష్యం అనే పదం మన లైఫ్ లో లేకుండా వుంటుంది.పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని సాధించలేకపోయామని బాధపడడం కన్నా చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని వాటిని సాధించాక వేరే గోల్స్ పెట్టుకోవడం మంచిది.

చాలామంది గోల్స్ పెట్టుకుంటారు కానీ వాటిమీద ఫోకస్ పెట్టరు. మీ గోల్స్ మీద మీరు కరెక్ట్ గా ఫోకస్ చేస్తే మీరు సాధించలేనిదంటూ ఏదీ వుండదు.

4. How To Be Successful In Life | Good Habits

గుడ్ హాబిట్స్ అంటే మంచి అలవాట్లు. మన అలవాట్లే మన ఫ్యూచర్ ఎలా వుంటుంది అని డిసైడ్ చేస్తాయి. సాధారణంగా అందరూ వారికున్న అలవాట్లు అన్నీ మంచి అలవాట్లే అని పక్కవారివే మంచి అలవాట్లు కాదని అనుకుంటారు.

అలా కాకుండా సక్సెస్ అయిన వారి అలవాట్లు గమనిస్తే చాలా ప్రత్యేకంగా వుంటాయి. మనం కూడా వారిలాగా మంచి అలవాట్లు అలవరచుకుంటే తప్పకుండా మన లైఫ్ బాగుంటుంది.

జరిగిపోయిన విషయాల గురించి బాధపడుతూ చాలా మంది భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేస్తారు. ఇది మాత్రం గుడ్ హాబిట్ కాదు చాలా చాలా బాడ్ హాబిట్. సక్సెస్ఫుల్ పర్సన్స్ ని గమనిస్తే గతంలో ఏం జరిగింది అనేది వారికనవసరం వారు కేవలం జరగబోయేదాని గురించి మాత్రమే ఆలోచిస్తారు.

ఎవరి మెప్పు పొందడం కోసం కాకుండా మన మనస్సు మనల్ని మెచ్చుకునేలాగా పని చేయడం, అనుకున్న పని అనుకున్నట్లుగా వాయిదా వేయకుండా చేయడం, ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటినుండే టెన్షన్ పడి హెల్త్ పాడుచేసుకోకుండా వుండడం, సాధ్యమైనంత వరకు అందరితో కలిసిమెలిసి ఆనందంగా వుండడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి అలవాట్లు వుంటాయి.

5. How To Be Successful In Life | Create Ideas

క్రియేట్ ఐడియాస్ అంటే ఆలోచనలను సృష్టించండి అని అర్దం. కొన్నిసార్లు ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషనే లేదు అని అనుకున్న వాటిని కూడా కొంతమంది చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఎలా అంటే వారు ఆలోచించే విధానం కరెక్ట్ గా వుండడం వల్ల.

నేనొక బ్లాగర్ ని, నేను ఏ బ్లాగ్ పోస్ట్ రాయాలన్నా ఇన్ఫర్మేషన్ కోసం నెట్ లోనే సెర్చ్ చేయాలి. అంటే ఇంటర్నెట్ లేకుండా నేనేమీ చేయలేను, కానీ నెట్ కోసం నేను యూస్ చేసే Jio రూటర్ ఈమధ్య అస్సలు సిగ్నల్ వుండడం లేదు దాంతో నా వర్క్ అవ్వక చాలా చిరాగ్గా అనిపించేది.

ఏంచేయాలో అర్దం కాలేదు. రూటర్ ఎక్కడ పెట్టినప్పుడు సిగ్నల్ బాగా వస్తుందా అని దానిని ఇంట్లో ప్రతీ రూమ్ లో వుంచి చూశాను. అది కిటికీ దగ్గర పెట్టినప్పుడు మాత్రమే ఫుల్ సిగ్నల్ రావడం గమనించాను.

వెంటనే నాకో ఇడియా వచ్చింది, ఆ రూటర్ ని ఒక చిన్న క్లాత్ తో కిటికీకి కట్టేసాను. అంతే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. నెట్ బాగా వస్తుంది.

ఒకవిషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే “ప్రతి ప్రాబ్లమ్ కి ఖచ్చితంగా సొల్యూషన్ వుంటుంది.”

6. How To Be Successful In Life | Willpower 

How to be successful in life

విల్ పవర్ అంటే సంకల్ప శక్తి. మన సంకల్పం ఎంత బలంగా వుంటే మనం అనుకున్నది అంత త్వరగా సాధించగలం అని అందరూ అంటారు.

పైన వున్న ఇమేజ్ లో పిల్లలు ఒక పడవ లో వున్నారు, తెడ్లు వేయడానికి అక్కడ ఎవరు లేరు తెడ్లు కూడా అక్కడ లేవు అయినా ఆ పిల్లలు ఏమీ చేయలేములే అని కూర్చోకుండా తమ చేతులనే తెడ్లుగా వుపయోగించి పడవ కదిలే లాగా చేస్తున్నారు.

ఇది కేవలం ఫోటో నే కావచ్చు వాళ్ళని అలా ఫోటో కోసమే చేయమని అని వుండవచ్చు కానీ నిజ జీవితంలో కూడా మనం పరిస్తులకి తలొగ్గకుండా ధైర్యంగా వుంటే ఎలాంటి పరిస్తితులు ఎదురైనా మనం వాటిని ఎదుర్కొనవచ్చు.

7. How To Be Successful In Life | Emotional Intelligence

ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే హావభావాల తెలివి. మన ఆలోచనలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికైనా మన లక్ష్యాలను సాధించడానికైనా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యం.

విజయం వచ్చినా, పరాజయం ఎదురైనా, ఆనందమైనా, బాధ అయినా,కోపం అయినా, చిరాకు అయినా ఇంకే ఫీలింగ్స్ అయినా అంటే మన భావోద్వేగాలను అన్నిటినీ కంట్రోల్ చేసుకుని ఎదుటివారితో ఎలా మాట్లాడాలో తెలియకపోతే మనం జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది.

కొన్ని సార్లు మనం ఒకటి మాట్లాడితే ఎదుటివారు మరొకలా అర్దం చేసుకుంటారు అది ఎందుకు అంటే మన భావాలను సరిగ్గా వ్యక్త పరచడం తెలియకపోవడం వల్ల.

ఎవరినీ నొప్పించకుండా మనం బాధపడకుండా చెప్పాలనుకున్న విషయాన్ని ఎదుటివారికి చెప్తే చాలా వరకు ఎలాంటి సమస్యలు రాకుండా వుంటాయి.

8. How To Be Successful In Life | Think positively

థింక్ పాజిటివ్లీ అంటే సానుకూలంగా ఆలోచించండి. అంటే నెగెటివ్ గా ఆలోచించకుండా వుండడం.

నేను 8th క్లాస్ లో వున్నప్పుడు మేరీ అని ఒక ఫ్రెండ్ వుండేది. పాపం తను బాగా నల్లగా వుండేది. అందరూ తనని ఏదో రకంగా ఏడిపిస్తూ వుంటే నాకు బాధనిపించేది కానీ తను మాత్రం నల్లగా వున్నందుకు ఎప్పుడూ బాధపడేది కాదు ఎందుకంటే తను ఒకటే మాట చెప్పింది.

తెల్లగా అందంగా వుంటే ఎండలో తిరిగితే నల్లగా అయిపోతానేమో అని బాధపడుతూ, ఎవరైనా వెంటబడి ప్రేమించమని, పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తారేమోనని భయపడుతూ వుండాల్సి వచ్చేది ఇప్పుడా సమస్య లేదు కదా అని నవ్వేసింది.

ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం వుంటుంది దాన్ని ఒక లోపంగా కాకుండా నా ఫ్రెండ్ లాగా పాజిటివ్ గా తీసుకుంటే లైఫ్ చాలా చాలా హ్యాపి గా వుంటుంది.

9. How To Be Successful In Life | Mental strength

మెంటల్ స్ట్రెంగ్త్ అంటే మానసిక బలం. జీవితంలో విజయం సాధించడానికి మన శరీరం మాత్రమే బలంగా వుంటే సరిపోదు మన మనసు కూడా బలంగా వుండాలి.
మానసిక బలం ఉన్నవారు తమ భావోద్వేగాలను, ఆలోచనలను నియంత్రణలో వుంచుకుంటారు. ఎలాంటి పరిస్తితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. వారు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పగలుగుతారు. ఏ సమస్యలు ఎదురైనా చాలా ఈజీగా వాటినుండి బయటపడతారు. వీరి దృష్టిలో అసాధ్యం అని ఏదీ వుండదు.
శరీరం దృడంగా వుండాలంటే ఎక్సర్సైజ్ చేస్తారు లేక జిమ్ కి వెళతారు. మరి మానసికంగా బలంగా వుండాలంటే ఏం చేయాలి అని అనుకుంటున్నారా?

3 టిప్స్ ఫర్ మెంటల్ స్ట్రెంగ్త్

1. self-determine ( స్వీయ నిర్ణయం ) : కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా ఇతరుల నిర్ణయం మీద ఆధారపడుతూ వుంటారు. అలా కాకుండా మన సొంతంగా నిర్ణయాలు తీసుకునేలాగా వుంటే వాళ్ళ మాట వినకుండా వుంటే బాగుండు అని మిమ్మల్ని మీరు తిట్టుకునే పరిస్థితి రాకుండా వుంటుంది.

2.Have Patience ( సహనం కలిగి ఉండడం ) : సహనం లేని వారికి చాలా త్వరగా కోపం వస్తుంది. కోపం వల్ల ఆరోగ్యం పాడవడం లేక అందరితో గొడవలు రావడం తప్పించి ఉపయోగం ఏమీ వుండదు కదా? మనం ఏం సాధించాలన్నా ఆరోగ్యంగా వుండాలి కదా!

3.Uncompromising Attitude ( రాజీలేని వైఖరి ) : చాలా మంది ఏం జరిగినా నా తలరాత ఇంతేలే నేనేం చేసినా అది సక్సెస్ అవ్వదు ఇంక నా బ్రతుకు ఇంతే అని రాజీ పడిపోతూ వుంటారు. అలాంటి ఆటిట్యూడ్ వుంటే ఎప్పటికీ సక్సెస్ కాలేరు. మీరు సక్సెస్ కావాలంటే రాజీలేని వైఖరి అలవర్చుకోవాలి. అంటే మీరు అనుకున్నది ఏదీ జరగకపోయినా సక్సెస్ సాధించేవరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే వుండాలి.

10. How To Be Successful In Life | Be Persistent

బి పెర్సిస్టెంట్ అంటే పట్టుదలతో ఉండండి అని అర్దం. పట్టుదల అనగానే నాకు తప్పటడుగులు వేసే పిల్లలు గుర్తొస్తారు ఎందుకంటే వాళ్ళు నడిచే ప్రక్రియలో ఎన్నోసార్లు కింద పడిపోతారు ఎన్నో దెబ్బలు తగులుతాయి అయినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి చక్కగా నడవడం నేర్చుకుంటారు.

“Your hardest times often lead to the greatest moments of your life. Keep going. Tough situations build strong people in the end.”

“మీ కష్టతరమైన సమయాలు తరచుగా మీ జీవితంలో గొప్ప క్షణాలకు దారి తీస్తాయి. కొనసాగించండి. కఠినమైన పరిస్థితులు చివరికి బలమైన వ్యక్తులను నిర్మిస్తాయి. ”  — Roy T. Bennett

పట్టుదల వున్నవాడు ఎవరెస్ట్ అయినా ఎక్కగలడు, పట్టుదల లేనివాడు కనీసం మెట్లు కూడా ఎక్కలేడు.

11. How To Be Successful In Life | How to Say No

హౌ టు సే నో అంటే “లేదు అని చెప్పడం ఎలా? కొంత మందికి మొహమాటం చాలా ఎక్కువ. ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అని గానీ కాదు అని గానీ అస్సలు చెప్పలేరు. అలా మొహమాటం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు అయినా అంతే వారిలో మార్పురాదు.

మీ మొహమాటం వల్ల మీరెన్ని సమస్యల్లో ఇరుక్కున్నారో ప్రతిక్షణం గుర్తు తెచ్చుకుంటూ వుంటే కొంత అయినా మీలో మార్పు వచ్చే అవకాశం వుంటుంది. మంచితనం అంటే మీరు చేయగలిగిన సహాయం చేయడం అంతే కానీ సహాయం చేసి మీరు కష్టాల్లో పడడం కాదు అదెప్పుడు గుర్తుపెట్టుకోండి.

12. How To Be Successful In Life | Take away distractions

టేక్ ఎవే డిస్ట్రాక్షన్స్ అంటే పరధ్యానం తొలగించండి అని అర్ధం. పరధ్యానం అంటే చేసే పనిమీద కాకుండా వేరే ఏదో ఆలోచనలో వుండిపోవడం.

డ్రైవింగ్ లో వున్నప్పుడు పరద్యానం గా వుంటే ఏక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ వుంది. మన బాస్ చెప్పేటప్పుడు పరద్యానంగా వుంటే మన జాబే పోయే అవకాశం వుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా మాట్లాడేటప్పుడు పరద్యానం గా వుంటే రిలేషన్ దెబ్బతినే ఛాన్స్ వుంది.

కాబట్టి పరద్యానం అనేది మన లైఫ్ లో లేకుండా వుంటే మనం సక్సెస్ సాధిస్తాము.

ముగింపు:

లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ఎన్నో టిప్స్ వుంటాయి. మనం అన్నీ పాటించనవసరం లేదు కానీ మనకి ఏది అవసరమో అది తెలుసుకుని వాటిని పాటిస్తే తప్పకుండా సక్సెస్ అవుతాము. సక్సెస్ సాధించాలంటే కొంత టైం పడుతుంది, ఎన్నో పరాజయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎంతో మంది అనే సూటిపోటి మాటలను తట్టుకోవాల్సి వస్తుంది.

ఒక రాయి శిల్పం గా మారడానికి శిల్పి చేతిలో ఎన్నో దెబ్బలు తింటుంది, ఆ తరువాతే దానికో రూపం వస్తుంది. మనం కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తింటేనే జీవితం అంటే ఏంటో? జీవితంలో గెలవడం ఎలాగో తెలుస్తుంది.

మీకు ఈ పోస్ట్ నచ్చితే షేర్ చెయ్యండి. ఈ పోస్ట్ ఎంతవరకు యూస్ అయ్యిందో కింద కామెంట్ చెయ్యండి. కొత్త పోస్ట్స్ అప్డేట్స్ కావాలనుకుంటే బ్లాగ్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి. మళ్ళీ మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాను.


Response (4)
 1. S
  Sailu April 2, 2022

  Wonderful information

  1. N
   Nayara April 2, 2022

   Thank You so Much, Subscribe For The latest Articles.

 2. M
  Mende anil July 21, 2022

  Greatest words for life and success
  thank you so much

  1. N
   Nayara July 23, 2022

   Thank you so much for reading & commenting on my post. Subscribe for future updates & new posts.

Leave a comment
Your email address will not be published. Required fields are marked *