How To Stop Overthinking In Telugu

N

How To Stop Overthinking In Telugu

1. అతిగా ఆలోచించడం అంటే ఏమిటి ?

ఓవర్‌ థింకింగ్  అంటే అతిగా ఆలోచించడం. అతిగా అంటే అవసరానికి మించి ఆలోచించడం. మనం చాలా సార్లు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ లేక మన మనసు బాగా బాధ పడినప్పుడు కానీ ఎక్కువగా ఆలోచిస్తాము.

అలా ఆలోచించి ఆలోచించి నా తల బద్దలైపోతున్నట్లు ఉంది అని అంటాం కదా? అలా ఆలోచించడం వల్ల మన ఆరోగ్యం పాడవడం తప్పించి ఏ ఉపయోగం ఉండదు అని మనందరికీ తెలుసు.అయినా ఆలోచిస్తూనే ఉంటాం. అయినా మనిషన్న ప్రతీ వాడికి ఆలోచనలు ఉంటాయి నాకు మాత్రమే కొత్త కాదు కదా! అని మనకు మనమే సర్ది చెప్పుకుంటాం.

మన జీవితంలో ఏదో ఒక సమయంలో మనమందరం ఆందోళన లేదా బాగా ఒత్తిడిని కలిగించే సంఘటనలను అనుభవించే ఉంటాము. నా చుట్టూ ఉన్నవాళ్ళు బానే ఉన్నారుగా! అయ్యో నాకెందుకు ఇన్ని సమస్యలు అని ఒక్కసారి అయినా అనుకోని వారు దాదాపుగా వుండరేమో అని అనుకుంటున్నాను.

అతిగా ఆలోచించడం వల్ల మనలో నిరాశ పెరిగిపోతుంది. ఏ విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోలేము, సమస్యకి తగిన పరిష్కారం దొరకక నిద్రపట్టదు. అప్పుడు వున్న ఆలోచనలు ఇంకా ఎక్కువయ్యి మన సమస్యలు ఇంకా పెద్దవిగా కనబడతాయి. భవిష్యత్తు అంతా అంధకారంగా కనిపిస్తుంది.

2. How To Stop Overthinking In Telugu | నేను ఎందుకు అతిగా ఆలోచించాలి?

నేను ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నాను? ఈ ప్రశ్న మీకు మీరు ఎప్పుడైనా వేసుకున్నారా?

చాలా మంది ఈ ఓవర్‌ థింకింగ్‌ అనేది ఒక సహజమైన మానవ లక్షణంగా చూస్తారు. అంతేకాకుండా దీనిని మేము మార్చలేము ఇది మా చేతిలో లేనిది, ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు అని అనుకుంటారు. ఎప్పుడో ఒకసారి అతిగా ఆలోచించడం అనేది పర్వాలేదు కానీ ఇది మన జీవితంలో ఒక భాగం అయితే మాత్రం చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

3. How To Stop Overthinking In Telugu | అతిగా ఆలోచించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు 

1. అలసట ( Fatigue )
2. తలనొప్పి ( Headaches )
3. చిరాకు ( Irritability )
4. వేగవంతమైన హృదయ స్పందన ( Fast heartbeat )
5. డ్రై మౌత్ ( Dry mouth )
6. శక్తి స్థాయిలు పడిపోవడం ( Your energy levels may drop )
7. ఆకలిలో మార్పు రావడం ( Your hunger may change )
8. సమస్య పరిష్కార సామర్థ్యం తగ్గిపోవడం ( Interferes with problem-solving ability )
9. సరిగ్గా నిద్ర పట్టకపోవడం ( Disrupts your sleep )
10. మైకము ( Dizziness )

 

How To Stop Overthinking In Telugu

అతిగా ఆలోచించడం వల్ల కలిగే నష్టం ఏమిటి అనేది ఒక్క మాటలో చెప్పాలంటే మన లైఫ్ స్పాన్ ( జీవించే సంవత్సరాలు ) తగ్గిపోయే అవకాశం వుంది. తరచుగా కోపం వచ్చే అవకాశాలు కూడా వున్నాయి.  జీవితంలో ఏదొక సమస్య రాకుండా వుండదు, కష్టాలు రాకుండా వుండవు మరి అలాంటప్పుడు అతిగా ఆలోచించకుండా ఎలా వుండాలి అని ఆలోచిస్తున్నారా?

4. How To Stop Overthinking In Telugu | అతిగా ఆలోచించడం ఆపడానికి 10 చిట్కాలు

  4.1. గతాన్ని వీడండి ( let go of the past )

మనలో చాలా మంది జరిగిపోయిన దానిగురించి ఆలోచించి బాధపడుతూ వుంటాము. ఒకప్పుడు నేను కూడా అలాగే వుండేదాన్ని. అప్పుడు అది ఎందుకలా జరిగింది, వాళ్ళు అప్పుడు ఎందుకలా మాట్లాడారు, మనుషులు ఎప్పుడూ ఇంతేనా చేసిన మేలు మర్చిపోవడమేనా, అందరూ ఎందుకింత స్వార్ధంగా తయారవుతున్నారు, వాల్ల తీరు వారిదేగాని ఎదుటివారి గురించి ఆలోచించరా? ఇలా ఆలోచిస్తూ చాలా చాలా టైం వేస్ట్ చేశాను.

కానీ ప్రస్తుతం నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసుకున్నాను, ఎందుకంటే గతం గురించి గతంలో జరిగిన సంఘటనల గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం ఏమీ వుండదు. దానివల్ల ప్రస్తుతం వున్న సంతోషాన్ని కోల్పోతాము అని నాకు పూర్తిగా అర్ధం అయ్యింది.

  4.2. భావోద్వేగాలను నియంత్రించండి ( Take Control Of Your Emotions )

ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు. ఆనందం, ప్రేమ, భయం, కోపం లేదా ద్వేషం ఇలాంటి వాటినన్నిటిని ఎమోషన్స్ అంటారని మనకు తెలుసు. వాటిని నియంత్రణలో వుంచుకోవడం అంటే వాటిని అతిగా ప్రదర్శించకుండా ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు చూపించాలో తెలుసుకోవడం.

కొంతమంది ఇంట్లో ఎలా వుంటారో తెలియదు కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం తమ పిల్లల మీద కానీ తమకు బాగా ఇష్టమైన వాళ్ళ మీద చూపించే ప్రేమ చూస్తే చుట్టూ వున్నవాళ్ళకి అది కొంచెం అతిగా అనిపిస్తుంది. ప్రపంచంలో వీళ్ళకు మాత్రమే పిల్లలున్నట్లు ఏంటా ప్రవర్తన అని అనుకుంటాం.

కొంత మంది అయితే ఇంట్లో వున్నప్పుడు కోపం వస్తే ఎదుటివారిని ఎలా తిడతారో పదిమందిలో కూడా అలాగే తిడతారు. అందరూ ఏమనుకుంటారో అన్న ద్యాసే అస్సలు వుండదు. కొంతమందికి కుక్కలంటే చాలా భయం భయట కుక్క కనిపిస్తే చాలు నానా హంగామా చేస్తారు. అందర్లో చులకన అవుతాము అనికూడా ఆలోచించరు.

ఇలా మన ఎమోషన్స్ కంట్రోల్ లో లేకపోతే మనం ఎంత మంచివారమైనా ఇతరుల దృష్టిలో చెడ్డవారం గా మిగిలిపోయే అవకాశం వుంది.

  4.3. పరిష్కారాలపై దృష్టి పెట్టండి ( Focus On Solutions )

“Focus 90% of your time on solutions and only 10% of your time on problems”

“మీ సమయం 90% పరిష్కారాలపై మరియు మీ సమయం 10% మాత్రమే సమస్యలపై దృష్టి పెట్టండి” —Anthony J. D’Angelo

పరిష్కారాలపై దృష్టి పెట్టడం అంటే సమస్య ఏమిటి మరియు పరిష్కారం ఏమిటి? అని తెలుసుకోవడం. పిల్లలు అద్భుతంగా సమస్య పరిష్కారాలు కనుగొనగలరు ఎప్పుడు అంటే పెద్దలు వారి సమస్య పరిష్కార నైపుణ్యాలను ఉపయోగించుకునే అవకాశాలను అందించినప్పుడు. పిల్లలు పరిష్కారాల కోసం అనేక సృజనాత్మక ఆలోచనలను కలిగి ఉంటారు. మనం వాళ్ళ ఆలోచనలకు విలువ ఇస్తున్నాము అంటేనే వాళ్ళు ఏదైనా చెప్పగలరు.

కానీ మనలో చాలా మంది నువ్వు చిన్నపిల్లవి / చిన్నపిల్లోడివి నీకేం తెలుసు నోరుమూసుకో అని తిడుతూ వుంటాం దాంతో వారిలో వున్న ఆలోచనా శక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా వుంది. కొంత మంది ప్రతీ దానికి ఇతరుల నిర్ణయం మీద ఆధారపడుతూ వుంటారు. ఇలా ఇంకొకరి మీద ఆధార పడడం వల్ల కూడా వున్న సమస్యలు ఎక్కువయ్యి ఎలా పరిష్కరించాలో అర్దం కాక సతమతమవుతూ వుంటారు.

అందుకే ప్రతీ ఒక్కరూ ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకునేలాగా చిన్నప్పటి నుండి అలవాటు చేయడం మంచిది. ఇప్పటి వరకు అలవాటు లేకపోయినా ఇకముందు అయినా మీ సమస్యలను మీరే పరిష్కరించుకునే లాగా మీ మనస్సుని సిద్దం చెయ్యండి.

  4.4. పరిపూర్ణతను పక్కన పెట్టండి ( Put aside perfectionism )

పర్ఫెక్షనిసం అంటే పరిపూర్ణత అని అర్ధం. “ఏ పని చేసినా నేను పర్ఫెక్ట్ గా చేస్తాను నీలాగా సగం సగం పనులు నాకు అలవాటు లేదు” ఈ మాట చాలా మంది దగ్గర మీరు వినే వుంటారు కదా? నిజమే ఏ పనిచేసినా పర్ఫెక్ట్ గా చేస్తేనే మనసుకు సంతోషమైనా పదిమందిలో గుర్తింపయినా వుంటుంది. కానీ ఆ పర్ఫెక్షనిసం కొంచెం ఎక్కువయితేనే సమస్యలు వస్తాయి.

ఇలా ప్రతీదీ పర్ఫెక్ట్ గా చేయాలి అనుకునేవారు వాళ్ళు గతంలో ఏమి చేసారో దానిగురించి అయినా లేదా చేయవలసిన దాని గురించి అయినా ఆలోచిస్తూ చింతిస్తూ ఎక్కువ సమయం గడుపుతుంటారు. వాళ్ళు దేనిలో విజయం లభించినా ఏమాత్రం సంతృప్తి లేకుండా చేయలేని దాని గురించి ఆలోచించి బాధ పడుతుంటారు. సరిగ్గా ఆహారం కూడా తీసుకోలేని సందర్బాలు కూడా రావచ్చు.

ఇలాంటి వారు కొన్నిసార్లు డిప్రెషన్ లోకి వెళ్ళడం లేదా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం కూడా జరగవచ్చు. అందుకే పర్ఫెక్ట్ గా వుండండి కానీ పర్ఫెక్షనిసం కి బానిస కాకండి, దేనికైనా లిమిట్ వుండాలి కదా ?

  4.5. మీ భయాలను ఆలింగనం చేసుకోండి ( Embrace your fears )

పాము ని చూస్తే మనం భయపడతాం దానినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తాము అంటే ఇక్కడ భయపడడం వల్ల తప్పించుకునే మార్గం ఆలోచిస్తున్నాం కాబట్టి భయం మనకి మంచే చేసింది. కానీ కొంతమంది ప్రతి చిన్న విషయాలకు భయపడుతూ వుంటారు అలాంటి వారు ఎప్పుడు సంతోషంగా వుండలేరు.

భయాన్ని ఆలింగనం చేసుకోవడం అంటే మనల్ని ఎక్కువగా భయపెట్టే వాటిని ఎదుర్కోవటం మరియు అధిగమించడం అని అర్ధం. దీనికి చాలా ధైర్యం అవసరం అనుకోండి కాకపోతే అసాధ్యం అయితే కాదు కదా!

మన భయాల్ని అన్నిటినీ ఒకేసారి జయించాల్సిన అవసరం అయితే లేదు, ఒక్కొక్కటిగా జయిస్తూ వుంటే చివరకు మనం భయపడే విషయం అంటూ ఏదీ వుండదు.

  4.6. మీరు చేయగలిగేదాన్ని గుర్తించండి ( Recognise what you can )

మీరు చేయగలిగేదాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అదేంటి అలా అడుగుతున్నాను అని అనుకుంటుంన్నారా?

అవును మనలో చాలా మంది నేను అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను, నాకు బైక్ వుంటే ఈ జాబ్ వచ్చేది అది లేకే జాబ్ రాలేదు అనో నేను బాగా చదువుకుని వుంటే మంచి ఫ్యూచర్ వుండేది అనో నా దగ్గర బాగా డబ్బు వుంటే చక్కగా బిజినెస్ చేసుకునే వాడిని అనో ఇంకొంచెం కలర్, హైట్ వుంటే హాయిగా సినిమా హీరో అయిపోయి వుండేవాడిని అనో ఇలా ఒకటేమిటి మనం చేయలేని వాటి గురించి జరగని వాటి గురించి చాలా చాలా ఆలోచిస్తూ వుంటాము కదా!

మనం జీవితం లో సంతోషంగా వుండాలి అన్నా ఏదైనా సాధించాలి అన్నా ముందు మనం చేయగలిగిన విషయాల మీద దృష్టి పెట్టాలి.

  4.7. మరొకరికి మంచి ఏదైనా చేయండి ( Do something nice for someone else )

మనం చేయగలిగినంతలో ఎవరికైనా మంచి చేస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేము. అలా కలిగే ఆనందం వల్ల మన మనస్సుకి చాలా సంతృప్తిగా వుంటుంది. మన మనస్సు బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది.

జీవితంలో మనం ఏం చేయాలి అన్నా ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా వుండడం చాలా ముఖ్యం. అప్పుడు దేని గురించి అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాము.

మన జీవితంలో ఎదురైయ్యే ప్రతి సమస్యకి తప్పకుండా పరిష్కారం వుంటుంది. అందుకే ఎప్పుడూ మన కష్టాలు మన సమస్యలు అని బాధపడుతూ వుండకుండా ఎదుటి వారికి మంచి చేస్తూ వుండాలి.

  4.8. మీ విజయాలను గుర్తించండి ( Acknowledge your successes )

మనం సంపాదించే ప్రతి విజయం మన అభిరుచికి మన కలలకి తగినట్లు వచ్చే విజయమే. ఏ చిన్న విజయం సాధించినా ఎవ్వరూ మనల్ని అభినంధించక పోయినా మనల్ని మనం అభినందించుకోవాలి.

ఎందుకు అంటే కొన్ని సార్లు మనం ఎన్ని సాధించినా ఇంతేనా అనేవారు, మనకన్నా ఎక్కువ సాధించిన వారితో పోల్చిచూసి మనం సాధించింది ఏమీ లేదు అని నీరుత్సాహపరిచే వారు చాలా మంది వుంటారు.

మనం సాధించిన ప్రతి లక్ష్యం, మన నైపుణ్యాలు, కృషి మరియు అంకితభావం కారణంగా మనం దేనికైనా అర్హులము అనే భావన మనకు కలుగాలి అప్పుడే మన మీద మనకు మరింత నమ్మకం కలుగుతుంది.

జీవితంలో పై స్థాయికి వెళ్ళిన వారెవరైనా చిన్న చిన్న విజయాలు సాధించిన తర్వాతే ఆ స్థాయికి వెళ్లారని మనం గుర్తుపెట్టుకోవాలి.

  4.9. రాయండి – పరిష్కారాలు (సమస్యలు కాదు) ( Write Down – Solutions (Not Problems) 

మనలో చాలా మంది తమకు వున్న సమస్యలు, కష్టాలు ఎవరికీ చెప్పుకోలేని విషయాలు అన్నీ కూడా రాసుకుంటూ వుంటారు. దానివల్ల ఏ ప్రయోజనం వుండదు.

మనకు వున్న సమస్యలకు తగిన లేదా మనకు అనిపించిన పరిష్కారాలు అన్నీ మనం ఒక చోట రాసుకుంటే అవి మనకు ఎంత వరకు ఉపయోగపడతాయో మనకు అర్దం అవుతుంది.

మనం మన సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించగలమో అనే విషయం మనకు క్లియర్ గా అర్ధం అవుతుంది. మనం రాసుకున్న పరిష్కారం ఒక వేళ సరిగ్గా ఉపయోగపడకపోతే ఎక్కడ మిస్టేక్ చేశామో అని మనకు తెలుస్తుంది.

ఏదైనా ఒక పద్దతి ప్రకారం చేస్తే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించగలం.

  4.10. ప్రస్తుతం లో ఉండండి ( Stay present )

గతాన్ని గురించి ఆలోచించకుండా ప్రస్తుతం లో వుండడం వల్ల ముఖ్యంగా మన తోటివారితో సంతోషంగా వుండగలం. రోజూ జరిగే సంగటనలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలం అంటే మన జ్ఞాపకశక్తి & మానసిక దృడత్వం పెరుగుతుంది.

మనం చేసే పని మీద ఫోకస్ చేయగలం, మనకు వున్న మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఎలా వుండాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో అర్దం అవుతుండి. మనకు నచ్చిన పని చేస్తూ సంతోషంగా వుండగలం.

“Be happy in the moment, that’s enough. Each moment is all we need, not more.” — Mother Teresa

ముగింపు:

How To Stop Overthinking అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా? ఇప్పటి వరకు జరిగి పోయిన దానిని మనం మార్చలేము కానీ మన భవిష్యత్తు మన చేతిలోనే వుంది. ఈ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి.

మీకు ఈ పోస్ట్ నచ్చితే షేర్ చెయ్యండి. ఈ పోస్ట్ ఎంతవరకు యూస్ అయ్యిందో, ఇంకా మీకు వేటికి సంభందించిన డీటైల్స్ కావాలో కింద కామెంట్ చెయ్యండి. కొత్త పోస్ట్స్ అప్డేట్స్ కావాలనుకుంటే బ్లాగ్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి. మళ్ళీ మరొక పోస్ట్ తో మీ ముందుకు వస్తాను.


Leave a comment
Your email address will not be published. Required fields are marked *